నిజమైన “బిచ్చగాడు”గా మారిన సినీ నటుడు!

Kannada actor Sharan Hruday - Nataraja Service - Beggar getupప్రముఖ కన్నడ సినీ నటుడు, కమెడియన్ కం హీరో శరణ్ బిచ్చగాడుగా మారిపోయాడు. మరికొద్ది రోజుల్లో తానూ నటించిన కొత్త సినిమా “నటరాజ సర్వీస్” విడుదల కానున్న నేపధ్యంలో శరణ్ ఈ అవతారంలో కనపడడం శాండిల్ వుడ్ కు షాక్ ఇచ్చింది. అంతేకాదు, బిచ్చగాడుగా ఒక రోజులో తానూ సంపాదించిన మొత్తం 128 రూపాయలుగా లెక్కించి, దానిని వీడియోగా చిత్రీకరించి మరీ సోషల్ మీడియాలో పెట్టారు.

ADVERTISEMENT

ఇదంతా నిజజీవితంలో జరిగినదే! కాకపోతే, తన కొత్త సినిమా ‘నటరాజ సర్వీస్’ కోసం పడ్డ శ్రమ ఇదంతా! సినీ ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు శరణ్ పడ్డ అపసోపాలు చూసి సినీ జనాలు అవాక్కయ్యారట. ముఖానికి గడ్డం, తలకు విగ్గు, కళ్ళకు అద్దాలు తగిలించుకుని, ఓ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను పక్కన పెట్టుకుని, తన ‘నటరాజ సర్వీస్’ సినిమాలోని పాటలు పాడుతూ 128 రూపాయలను సంపాదించుకున్నారు. దీన్నంతా సినిమా దర్శకుడు ఓ పక్కనుండి షూట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories