
ఇద్దరం ఒకే స్కూల్ లో చదువుకున్నప్పటికీ, పెద్దగా పరిచయం లేదని, ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ప్రవీణ్ ద్వారా ‘హాయ్’ అంటే ‘హాయ్’ అంతేనని, అప్పుడు మహేష్ ది ఫియట్ కారు, నాది ఫియట్ కారు, పక్కపక్కనే పార్క్ చేసి ఉండేవని తెలిపాడు కార్తీ. అయితే ఇప్పుడు చూస్తున్న మహేష్ కు, అప్పుడు చూస్తున్న మహేష్ కు సంబంధం లేదని, అప్పట్లో మహేష్ చాలా లావుగా ఉండేవాడని, ఆ తర్వాత లయోలా కాలేజీలో చేరిన తర్వాత మహేష్ ను చూసి ఆశ్చర్యపోయానని, బోట్ క్లబ్ లో ఎప్పుడూ పరిగెత్తేవాడని, చాలా కష్టపడ్డాడని కార్తీ చెప్పిన సంగతులు ప్రిన్స్ అభిమానులను అలరిస్తున్నాయి.
హీరో అయిన తర్వాత వచ్చిన సినిమాలు చూసి మహేష్ కు ఫ్యాన్ అయిపోయానని, ఏమోషన్స్ ను అద్భుతంగా పండించడంలో మహేష్ సిద్ధహస్తుడని ప్రశంసలు కురిపించాడు. స్కూల్ లో చూస్తున్నపుడు మహేష్ లో ఈ యాంగిల్ అసలు చూడలేదని, అయితే సినిమాలలో తను పెడుతున్న హార్డ్ వర్క్, సిన్సియారిటీ, పాషన్ నాకు బాగా ఇష్టమని అన్నాడు ఈ తమిళ హీరో.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…