Telugu

మొట్టమొదటి హీరో పవన్ కళ్యాణే!

ప్రజలను కొత్త సంవత్సరం పలకరించడానికి ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది. అయితే మూడు రోజుల ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2017’ చెప్పిన తొలి టాలీవుడ్ హీరోగా పవన్ కళ్యాణ్ తన “కాటమరాయుడు” ప్రస్థానానికి అడుగులు వేస్తున్నారు.

ముఖం కనపడకుండా పవన్ నడుస్తున్న అడుగులతో “కాటమరాయుడు” సెకండ్ లుక్ పోస్టర్ వచ్చేసింది. దీపావళి శుభాకాంక్షలుతో విడుదలైన ఫస్ట్ పోస్టర్ లో శృతిహాసన్ కూడా ఉండగా, ఈ సారి మాత్రం ఫక్తు మాస్ మసాలా ఫార్ములాతో కూడిన పోస్టర్ ను విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో దుమ్ము లేస్తుండగా… పంచెను పైకి కడుతున్న పవన్ స్టిల్ ఫ్యాన్స్ ను ఒక ఊపు ఊపుతోంది.

ADVERTISEMENT

తమిళ సినిమా ‘వీరమ్’కు రీమేక్ గా విడుదల కానున్న ఈ సినిమాను ‘గోపాల గోపాల’ ఫేం కిషోర్ కుమార్ (డాలీ) దర్శకత్వం వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ ను పూర్తి చేసుకుని, 2017 తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ జనవరి 1వ తేదీన విడుదల కానుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Exhibitors Strike: No Ticket Hikes for Upcoming Biggies!

The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…

22 minutes ago

కేసీఆర్‌ వైఖరి మారాలి.. కుర్చీలు కాదు!

నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు,…

36 minutes ago