
బాహుబలి లాంటి సినిమా తీయాలి అని చేతులు కాల్చుకున్నవాళ్ళని చాలామందిని చూసాం. దాదాపు అన్నీ భాషల ఇండస్ట్రీలు ఆ ప్రయత్నం చేసి భారీ నష్టాలు చవిచూశారు. ఇప్పుడు “పుష్ప” వంతు వచ్చింది. ఆ ఫార్మాట్ కథతో ఊర మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించాలని మలయాళం ఇండస్ట్రీ ఇప్పటికే రెండుసార్లు విఫలయత్నం చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఫెయిల్డ్ అటెంప్ట్ “కాటాలన్”.
పాల్ జార్జ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని “మార్కో” ఫేమ్ హనీఫ్ నిర్మించాడు. ఆంటోనీ వర్గీస్, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, దుషారా విజయన్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రిలీజ్ చేశారు. అన్నీ భాషల్లోనూ ఒకే టైటిల్ తో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమైంది.
సునీల్, రాజ్ తిరందసులు కీలకపాత్రలు పోషించడం వల్ల మాత్రమే కాక.. ఏనుగు దంతాలు దొంగతనం & స్మగ్లింగ్ చేసే ఫార్మాట్ మొత్తం ఎంత వద్దనుకున్నా “పుష్ప” సినిమాని గుర్తు చేస్తూనే ఉంటుంది. పుష్ప మాత్రమే కాదు పలు తెలుగు, తమిళ సినిమాల సీడీలన్నీ కలిపి మిక్సీలో వేసినట్లుగా “కాటాలన్” ఉండడం అనేది గమనార్హం.
పుష్పలో ఉన్నది కేవలం యాక్షన్ & స్మగ్లింగ్ కాదు.. అంతకుమించిన ఎమోషన్. దాన్ని వదిలేసి మిగతా అంతా పట్టుకొని, మళ్లీ దాన్ని మార్కో వరల్డ్ కి లింక్ చేయడం, అనవసరమైన యాక్షన్ బ్లాక్స్ ని ఇరికించడం, మితిమీరిన హింసాత్మక సన్నివేశాలను జొప్పించడం తప్ప “కాటాలన్”లో కనిపించిందేం లేదు. ఒకపక్క మంచి సినిమాలు తీస్తారు అనే మంచి పేరు ఉన్న మలయాళ చిత్రసీమ.. మరోపక్క ఇలా “పుష్ప”కి చీప్ కాపీలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ అనవసరమైన చెడ్డ పేరు మూటగట్టుకుంటుంది.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…