Telugu

నాడు బిఆర్ఎస్ ఓటమి కోసమైతే మరి నేడు.?

గత ఏడాది నుంచి కూడా తెలంగాణ రాజకీయాలలో చాల విస్తృతంగా వినిపిస్తున్న పేరు కల్వకుంట్ల కవిత. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన నాటి నుంచి నేడు జాగృతి అధ్యక్షురాలిగా పోరాడుతున్న నాటి వరకు కవిత పేరు తెలంగాణ రాజకీయాలలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది.

అయితే నాడు తనపై మోపిన లిక్కర్ కేసు బీజేపీ రాజకీయంలో భాగమని, తన తండ్రి కేసీఆర్ ని మానసికంగా దెబ్బకొట్టడానికి, బిఆర్ఎస్ ని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ కేసులు అంటూ వాదించారు కవిత. అలాగే ఈ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాను అంటూ ధీమాగా చెప్పారు.

ADVERTISEMENT

కవిత అనుకున్నట్టే గత నెలలో కవిత కు ఈ కేసుకి సంబంధం లేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు చెప్పడంతో కవిత తానూ కడిగిన ముత్యమే అంటూ తిరుమల శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తన అరెస్టు తో బిఆర్ఎస్ కి రాజకీయ నష్టం జరిగిందంటూ X లో పోస్టు చేసిన అన్న కేటీఆర్ కి కౌంటర్లు ఇచ్చారు.

అయితే తాజాగా ఈ కేసు పై విచారణ సంస్థ సీబీఐ ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించగా న్యాయస్థానం కవిత తో పాటుగా అరవింద్ కెజ్రీవాల్ అలాగే ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో 23 మందికి నోటీసులు జారీచేసింది.

దీనితో ఢిల్లీ లిక్కర్ కేసు మళ్ళీ మొదటికి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేడు హైద్రాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు ఈ నెల 16 వ తేదీన కేసు వికాహరణకు హాజరుకావాలంటూ కవితకు నోటీసులు అందించారు. అలాగే కవిత కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ ప్రకటించారు.

అయితే నాడు కేసీఆర్ పై రాజకీయ కక్ష్య సాధింపు కోసం, బిఆర్ఎస్ రాజకీయ ఓటమి కోసం తన మీద బీజేపీ లిక్కర్ కేసుతో రాజకీయం చేసిందంటూ ఆరోపించిన కవిత మరి ఇప్పుడు బీజేపీ పై ఎటువంటి ఆరోపణలతో ముందుకొస్తారు.? ఇప్పుడు కవితకు బిఆర్ఎస్ కు ఎటువంటి రాజకీయ బంధము లేదు, అలాగే కవిత కూడా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయం చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.

మరి రౌస్ రెవెన్యూ కోర్టులో వచ్చిన తీర్పుతో ఈ కేసు కవిత రాజకీయ జీవితం నుంచి ముగిసింది అనేలోపే మళ్ళీ నోటిసులతో ఇంటి తలుపు తడితే ఇప్పుడు బీజేపీ చేస్తున్న రాజకీయం బిఆర్ఎస్ గెలుపు కోసమా.? ఇప్పటికే బీజేపీ – బిఆర్ఎస్ మధ్య అంతర్గత పొత్తు కుదిరిందని,

అందుకు తగ్గట్టే బీజేపీ గెలుపు కోసం బిఆర్ఎస్, బిఆర్ఎస్ విజయం కోసం బీజేపీ తెరచాటు రాజకీయం సాగిస్తున్నట్టు తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కవిత కూడా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం కాబోతుంది అంటూ పలుమార్లు ఆరోపించారు కూడా.

ఈ నేపథ్యంలో ముగిసిన అధ్యాయం అనుకున్న ఢిల్లీ లిక్కర్ కేసు తిరిగి ప్రారంభం కావడంతో నాడు బిఆర్ఎస్ ఓటమి కోసమైతే నేడు బిఆర్ఎస్ గెలుపు కోసమా.? అంటూ సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు మొదలయ్యాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Venkatesh Maha’s Attahaasam Set for Summer 2027

Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…

6 minutes ago

No Restriction On KTR’s Passport, Foreign Travel?

Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…

16 minutes ago