
సినిమాలలో హీరోలు ద్విపాత్రాభినయం చేస్తే ప్రేక్షకులు సంతోషంగా చూస్తారు. అలాగే తండ్రి పోలీస్ ఆఫీసర్ లేదా జడ్జి, కొడుకు దొంగ లేదా అవినీతి పోలీస్ ఆఫీసర్ అయినా జనం చూసి ఎంజాయ్ చేస్తారు.
కానీ రాజకీయ నాయకులు ద్విపాత్రిభినయం చేస్తే ప్రజలు అంగీకరిస్తారా?అంటే కాదని ప్రధాని మోడీతో కేసీఆర్ దోస్తీని ప్రజలు అనుమానించినప్పుడు తెలిసింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వేరు, బిజేపి-బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలు వేరు. రెంటినీ కలిపి చూడకూడదని అప్పుడు కేసీఆర్ ఎంత సర్దిచెప్పినా అయన ద్విపాత్రాభినయాన్ని ప్రజలు హర్షించలేదు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ రాజకీయాలలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత తండ్రిలాగే ద్విపాత్రాభినయం మొదలుపెట్టారు.
“నాకు నా తండ్రి కేసీఆర్‌తో ఎటువంటి సమస్యా లేదు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తోనే సమస్య అంతా. నేను తండ్రి కేసీఆర్‌ని విమర్శించడం లేదు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని మాత్రమే విమర్శిస్తున్నాను. నా తండ్రిని పూజిస్తాను. ఓ పార్టీ అధినేతగా మరో పార్టీ అధినేత కేసీఆర్‌ని విమర్శిస్తాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
తండ్రితో సమస్యలు లేవంటూనే కేసీఆర్‌తో రాజకీయంగా విభేధిస్తున్నానని ఆమె లాజిక్ సహేతుకంగానే ఉంది. కానీ జనాలు దానిని ఎలా అర్థం చేసుకొని ఎలా రియాక్ట్ అవుతారు? ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా ముఖ్యం. తండ్రీ కూతుర్లు బద్ద శత్రువుల్లా కత్తులు దూసుకున్నా జనాలు నమ్మలేని పరిస్థితి వారే కల్పించుకుంటున్నారు. నాడు కేసీఆర్ కూడా ఇలాగే మైండ్ గేమ్స్ ఆడి దెబ్బ తిన్నారు. ఇప్పుడు కవిత వంతా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బదులు కాంగ్రెస్ లేదా బిజేపితో ఆమె యుద్ధాలు చేస్తే ప్రజలు నమ్మేవారేమో? కానీ బీఆర్ఎస్ పార్టీతోనే చేస్తున్నారు. కానీఆమెకు తప్పడం లేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీని నమ్ముకునే టీఆర్ఎస్ పార్టీ పెట్టారు కనుక! ఆ పార్టీ నుంచి నేతలను తీసుకొని, ఆ పార్టీని బూచిగా చూపిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్నారు కనుక… ఈ ద్విపాత్రాభినయం తప్పడం లేదు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…