Telugu

కవిత రాజకీయం ‘ప్రచారానికి’ సరిపోతుంది – మరి..?

తెలంగాణ రాజకీయాలలో నిత్యం ఏదొక మూల తెరాస అధినేత కవిత పేరు వినిపిస్తూనే వస్తుంది. అయితే ఏపీ మీద విమర్శలు చేస్తూ ప్రాంతీయ వాద రాజకీయంతో వార్తలలో నిలుస్తున్నారు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం అంటూ ఎక్కడొక్కడ నిరశన కార్యక్రమాలు చేస్తూ రోడ్ల మీద కనిపిస్తూ వార్తలొకెక్కుతున్నారు.

తాజాగా నేడు కూడా కవిత తన రాజకీయంతో వార్తల ముఖ్యంశాలలో చోటు సంపాదించుకున్నారు. ఉప్పల్ భగాయత్ నగర్ లో ఉద్యమకారులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెరాస అధినేత్రి కవిత భూపోరాటం మొదలుపెట్టారు. అయితే బోడుప్పల్ ఉద్యమకారులతో కలిసి నిర్వహించిన ఈ నిరశన కార్యక్రమంలో పోలీసులకు కవితకు మధ్య తోపులాట జరిగింది.

ADVERTISEMENT

నిరసన కార్యక్రమానికి అనుమతిలేదంటూ మహిళా పోలీసులు కవితను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించే ప్రక్రియలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడం, పోలీసులు బలవంతంగా కవిత అక్కడి నుంచి తరలించడంతో కవిత కు, ఆ పార్టీ తెరాస కు నేటి వార్తలలో కాస్త స్పేస్ లభించినట్టయ్యింది.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె గా, బిఆర్ఎస్ ఎంపీ గా ఎమ్మెల్సీ గా కవిత తెలంగాణ రాజకీయాలకు సుపరిచితమే కానీ కవితకు ఇప్పుడు ఆ గుర్తింపు కాకుండా తనకంటూ ఒక సొంత గుర్తింపు తన పార్టీకి ఒక గౌరవం దక్కాలని చూస్తున్నారు.

తెలంగాణ లో కవిత తెరాస కొత్త రాజకీయ పార్టీ కావడంతో ఆ పార్టీకి నిత్యం మీడియా ప్రచారం అవసరం. ఆ ప్రచారమే కవిత తెరాస ను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఇప్పుడు కవిత చేస్తున్న చర్యల వెనుకున్న పరమార్ధం కూడా ముందుగా తన తెరాస పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడమే.

అందులో భాగంగానే ఇలా నిత్యం ఏదొక అంశంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరసనలు చేయడం, లేదంటే మాజీ పార్టీ అయిన బిఆర్ఎస్ నాయకుల మీద అవినీతి ఆరోపణలు సాగించడం, అది కుదరక పొతే ఎదో ఒక అంశం ను రాజకీయం చేస్తూ ఏపీ ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చెయ్యడం కవిత డైలీ రాజకీయ రొటీన్ లో ఒక భాగమైపోయింది.

ముఖ్యంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కవిత తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్ లో ఉంటున్నారు. అలాగే తెలంగాణలో ప్రాంతీయవాదం రెచ్చకొట్టేందుకు కూడా ప్రతి అంశానికి తెలంగాణ అంటూ తోక తగిలించడం,

ప్రతి వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థిస్తూ తెలంగాణ జర్నలిస్టుల మీద ఏపీ పోలీసుల జులం అని, తెలంగాణ రాజకీయ మేధావుల మీద ఏపీ ప్రభుత్వ పెత్తనం అంటూ తనకు తన పార్టీకి అవసరం లేని అంశాల పై కూడా అనవసరమైన కామెంట్స్ చేస్తూ అటు సోషల్ మీడియాలో కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటుంది.

అయితే కవిత సాగిస్తున్న ఈ రాజకీయంతో కవితకు కవిత తెరాస కు కావాల్సినంత ప్రచారం అయితే వస్తుంది కానీ ఆ ప్రచారం తెలంగాణలో కవితను తెలంగాణ ప్రజల అమ్మ గా మార్చలేదు, తెరాస ను అధికారంలోకి తీసుకురాలేదు అనేది కవిత గ్రహించాలి.

గతంలో షర్మిల కూడా ఇదే విధంగా టి. వైసీపీ తో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం పోరాటం అంటూ రోడ్ల మీద ధర్నాలు చేసారు, పోలీసుల చేత అరెస్టులు కాబడ్డారు. కానీ చివరికి టి. వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనంతో తనువూ చాలించింది. కాబట్టి నేటితరం యువత ఈ రాజకీయ నేతల జిమ్మిక్కులకు ఆకర్షితులై వారి వెంట నడుస్తారనుకోవడం రాజకీయ నేతల అవివేకమే అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

1 hour ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

3 hours ago