
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఎదో ఒక రూపంలో వార్తలలో నిలుస్తున్నాయి. అయితే ఏపీ – తెలంగాణ మధ్య నీటి వివాదాలతో అధికార – ప్రతిపక్షాలు మీడియాకు అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి.
లేకుంటే కవిత – బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ విభేదాలు మీడియాతో పాటుగా ప్రత్యర్థి పార్టీలకు మంచి విందు భోజనాలను వండి వడ్డిస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాజకీయాలలో మరో హాట్ టాపిక్ వార్తలలో నిలిచింది.
కవిత – ప్రశాంత్ కిషోర్ భేటీతో తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ ఎదో ఒక సంచలమైన మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నాయి అనే చర్చ ఊపందుకుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కవిత, జన్ సూరజ్ పార్టీ తో ఘోర ఓటమిని మూటకట్టుకున్న ప్రశాంత్ కిషోర్ ఇద్దరు హైద్రాబాద్ లో భేటీ కావడంతో కవిత భవిష్యత్ పీకే ఆధీనంలోకి వెళ్లనుందా అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అయితే త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీని స్థాపిస్తా, ఏదొకనాటికి తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటా అంటూ కవిత ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇరువురి భేటీ కూడా కవిత కొత్త పార్టీ ఎంపిక కోసమేనా అన్న చర్చ జరుగుతుంది.
అయితే గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కి మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికలలో ప్రశాంత్ తన సొంత పార్టీనే గెలిపించుకోలేకపోవడం, కనీసం jsp కి డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆయన రాజకీయ వ్యూహాల పై నీలి నీడలు అలముకున్నాయి.
కానీ ప్రస్తుతం కవిత ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ పీకే నే కావడంతో కవిత ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా అన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే ఇన్నాళ్లు కవిత రాజకీయ ప్రయాణాన్ని షర్మిల రాజకీయ ప్రచారంతో పోల్చి చూసిన వారికీ, చూస్తున్న వారికీ కవిత తన చర్యలతో గట్టి సమాధానమే చెప్పబోతున్నట్టున్నారు.
కవిత పక్కా రాజకీయ ప్రణాళికతో, వ్యూహాత్మకంగానే తన రాజకీయ భవిష్యత్ కి ఒక్కో అడుగు వేస్తున్నారా అనేలా ప్రతి అంశంలోనూ కవిత ఆచితూచి వ్యవహారం చక్కబెట్టుతున్నారు. కేసీఆర్ ని పక్కన పెట్టి, కేటీఆర్ ని పక్కకి నెట్టి హరీష్ టార్గెట్ గా బిఆర్ఎస్ పై రాజకీయ యుద్ధం చేస్తున్నారు.
ఇప్పుడు అదే బాటలో కొత్త పార్టీకి కూడా బాటలు వేసే ప్రక్రియలో భాగంగానే కవిత పీకే తో చేతులు కలపబోతున్నారా.? అయితే సొంతింటి వైద్యానికి పనికిరాని ప్రశాంత్ వ్యూహాలు, కవిత భవిష్యత్ కి భరోసాగా నిలబడగలవా.? అసలు తెలంగాణ రాజకీయాలలో మరో కొత్త పార్టీకి స్పేస్ ఉందా.?
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం అంటూ బహుముఖ పోటీతో కిక్కిరిసిన తెలంగాణ రాజకీయంలో కవిత కొత్త పార్టీకి అవకాశం వస్తుందా.? కవితను నమ్మి, పీకే పై నమ్మకంతో కవిత వెంట నడిచేందుకు ఇతర పార్టీల నుండి నాయకులు కవిత వైపుకి వస్తారా.? ఆ అవకాశం కనిస్తుందా.?
Madhuri Jain gives traditional saree styling a moody, modern pulse in this striking photoshoot. Draped…
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…