
జనసేన అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో పార్టీ సమావేశం పెట్టుకుందామనుకుంటే పోలీసులు అనుమతి నిరాకరించారు. వారి సమస్యలు, వారి కారణాలు వారికి ఉంటాయి. కనుక వారిని తప్పు పట్టలేము. కోర్టు అనుమతిస్తే సమావేశం పెట్టుకుంటామని లేకుంటే పవన్ కళ్యాణ్ తన నివాసంలో మీడియా సమావేశంతో సరిపెట్టుకుంటారంటూ జనసేన తెలంగాణ చట్టం పట్ల గౌరవం కనబరిచింది.
కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నోటికొచ్చినట్లు మాట్లాడారు. ముఖ్యంగా ‘మీ సిఎం చంద్రబాబు నాయుడు కుర్చీ కిందకు నీళ్ళు వచ్చేస్తాయేమో?” అంటూ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ఎవరూ హర్షించలేరు. అలా మాట్లాడినందుకే కేసీఆర్‌కి చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి ఆమెకీ తెలుసు కదా?
తెలంగాణ టీడీపి లేదా జనసేన అడుగుపెట్టడానికి వీల్లేదంటున్నారు. తమ ప్రభుత్వం, రాష్ట్రంపై ఎవరి పెత్తనాన్ని సహించబోమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకున్నారు? గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేయించారు?
కేసీఆర్ ఇతర రాష్ట్రాలలోకి బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు కల్వకుంట్ల కవితకి తప్పనిపించలేదు. అది ఇతర రాష్ట్రాలపై పెత్తనం చేయడం కాదా?అంటే కల్వకుంట్ల కవిత ఏం సమాధానం చెప్తారు?
రాష్ట్ర విభజన సమయంలో “భౌగోళికంగా విడిపోతున్నామే తప్ప అన్నదమ్ముల్లా కలిసే ఉందామని” సుద్దులు చెప్పిన నోటితోనే ఆంధ్రా పాలకుల దోపిడీ అంటూ నీళ్ళ కోసం పేచీలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఆ పేరుతో తెలంగాణలో రాజకీయ మైలేజ్ పొందుతూనే ఉన్నారు. అందుకు వారే సిగ్గుపడాలి కదా?
హైదరాబాద్‌లో సినీ పరిశ్రమని ఫుట్ బాల్ ఆడుకుంటూనే ఉంటారు. కానీ సినీ పరిశ్రమని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే సినీ పరిశ్రమ బంగారు గుడ్లు పెట్టే బాతు కనుక. కానీ టీడీపి లేదా జనసేన పార్టీలు వస్తే అభ్యంతరం దేనికంటే వారితో అధికారం కోసం ఎన్నికలలో పోటీ పడాలి. వారు అధికారంలోకి వస్తే తాము అన్ని విధాల నష్టపోతామనే ఆందోళన. కనుక తమకు రాజకీయంగా లాభం కలిగించేవన్నీ కల్వకుంట్ల కవిత వంటి వారికి ఓకే లేకుంటే నాట్ ఒకే!
కొంతమంది రాజకీయ నేతలకు అమెరికా వెళ్ళి వైద్య చికిత్సలు చేయించుకోవడం గొప్పని ఎలా అనుకుంటారో, ఏపీ నేతలకు హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవడం గొప్పనుకొంటున్నారేమో? అందుకు ఏపీ ప్రజలు అభ్యంతరం చెపితే అర్థం చేసుకోవచ్చు. కానీ కవితకు అభ్యంతరం దేనికి?
కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ మంచి మాటకారితనం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ మాటకారితనం అహంభావంగా మారితే ఏం జరుగుతోందో అనుభవపూర్వకంగా వారే తెలుసుకున్నారు కదా? అయినా అదేవిధంగా మాట్లాడితే రాజకీయంగా మైలేజ్ లభిస్తుందని, లాభపడతామనుకుంటే వారిష్టం.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…