
బిఆర్ఎస్ పార్టీలో జరిగిన కవిత రచ్చ ఎపిసోడ్ లో భాగంగా అటు బిఆర్ఎస్ అగ్రనాయకుల నుంచి కవిత ఆరోపణల పై ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది, తిరిగి కవిత మీద ఎటువంటి ప్రతిదాడి జరుగుతుంది అనుకున్న వారికి సస్పెన్షన్ వేటు తో కవిత కథకు ముగింపు పలికింది బిఆర్ఎస్.
కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు ‘హస్తం’ ఉందని, సంతోష్ రావు తన తెరచాటు రాజకీయాలతో బిఆర్ఎస్ అధిష్టానం చెవిలో ‘కమలం’ పూలు పెడుతున్నారంటూ కవిత నేరుగా హరీష్, సంతోష్ లను టార్గెట్ చేసినప్పటికీ అటు హరీష్ నుంచి కవిత ఆరోపణలకు గట్టి కౌంటర్ రాలేదు.
అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం అంటూ మీడియా ముందుకొచ్చిన కేటీఆర్ సైతం కవిత ఎపిసోడ్ పై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. బిఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకుల పై కవిత చేసిన ఆరోపణలకు పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలే అందుకు జవాబు అంటూ మాటదాటేసారు కేటీఆర్.
అన్నా – చెల్లెళ్లుగా ఇన్నాళ్ల తమ రక్త సంబంధాన్ని, పార్టీ నాయకులుగా బిఆర్ఎస్ లో తమ 20 ఏళ్ళ రాజకీయ ప్రయాణాన్ని పక్కన పెట్టి కవిత మీద ప్రత్యారోపణలు చేసందుకు కేటీఆర్ అడుగు ముందుకు వేయలేకపోతున్నారా.? లేక దానికి ఇంకా కాస్త సమయం ఉందని భావిస్తున్నారా.?
ఇప్పటికే కవిత బిఆర్ఎస్ కు, ముఖ్యంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన హరీష్, సంతోష్ లను టార్గెట్ చేస్తూ ఏకంగా పార్టీ అస్తిత్వం మీదే గులాబీ జెండా ఉనికి పట్లే అనుమానాలు లేవనెత్తేలా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అంటూ, బిఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు అంటూ అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేసారు.
అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ సాధ్యం కాలేదని, బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ల ఇల్లు బంగారం అవ్వడం కాదని బిఆర్ఎస్ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగిందంటూ పరోక్షంగా అంగీకరించారు.
కేసీఆర్ దేవుడైన ఆయన చుట్టూ దెయ్యాలూయ్యంటూ, అలాగే కేసీఆర్ ను తప్ప తానూ పార్టీలో ఎవరి నాయకత్వాన్ని అంగీకరించను అంటూ పరోక్షంగా కేటీఆర్ నాయకత్వాన్ని సైతం వ్యతిరేకించేలా కవిత ప్రకటనలు ఇచ్చినా కేటీఆర్ మాత్రం ఇప్పటికి అదే నిశ్శబ్దం లో ఉంటున్నారు.
కేసీఆర్ రాజకీయ జీవితానికి అవినీతి మరకలు అంటాకా బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పొతే ఎంత.? అనే స్థాయి బహిరంగ విమర్శల వరకు కవిత వెళ్లారు అంటే బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏ స్థాయి రాజకీయాలు జరుగుతున్నాయో.? కవిత మీద అవి ఏ మేరకు ప్రభావాన్ని చూపుతున్నాయో.?
కవిత vs బిఆర్ఎస్ గా సాగుతున్న ఈ రాజకీయ పోరాటంలో ఇప్పటి వరకు అటు కేసీఆర్, హరీష్ ల నుంచి ఇటు సంతోష్, కేటీఆర్ ల వరకు కవిత మీద ప్రత్యక్షంగా ఎటువంటి రాజకీయ దాడి జరపలేదు. అలాగే ఎటువంటి ప్రతి విమర్శలకు దిగలేదు. ఈ నిశ్శబ్దం తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతతగా భావించాలా.? లేక కేటీఆర్ నిశ్శబ్దం లోనే శబ్దం దాగుందని గ్రహించాలా.?
YouTuber-turned-filmmaker Curry Barker’s debut feature film Obsession, made on a modest $0.75 million budget, has…
Aamir Khan has finalized his upcoming film schedule by locking in two major projects. The…