Telugu

అయ్యో కవితా! ఎంత పని చేశావమ్మా!

కల్వకుంట్ల కవిత తన పార్టీకి ‘టీఆర్ఎస్‌ పార్టీ’ అని పేరు పెట్టుకోవడం ద్వారా మూడు ప్రయోజనాలు సాధించబోతున్నారు. 1. బీఆర్ఎస్‌ పార్టీ ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం. 2. తన పార్టీ పేరుని బీఆర్ఎస్‌ పార్టీ నేతల చేతే రోజూ పలికిస్తూ తనదే అసలు సిసలైన టీఆర్ఎస్‌ పార్టీ అని ప్రజలకు నమ్మకం కలిగించడం. 3. బీఆర్ఎస్‌ పార్టీ నేతలెవరూ ‘టీఆర్ఎస్‌ పార్టీ’ అని తిట్టలేని పరిస్థితి కల్పించడం.

తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి తమ ‘కారు’ గుర్తుని పోలిన ఎన్నికల చిహ్నాలు కేటాయించవద్దని, చిన్న చిన్న తేడాలతో ఒకేలా కనిపించే వాటిని చూసి గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు అదే బీఆర్ఎస్‌ పార్టీ అని భావించి ఇతర పార్టీలకు లేదా స్వతంత్ర అభ్యర్ధులకు ఓట్లు వేస్తారని, దాని వలన తమ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని మొర పెట్టుకుంటుండటం అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

కనుక ఇప్పుడు కేసీఆర్‌ కూతురుగా మంచి గుర్తింపు, గౌరవం కలిగిన కల్వకుంట్ల కవిత తాటి కాయంత అక్షరాలతో వ్రాసున్న ‘టీఆర్ఎస్‌ పార్టీ’ పేరుతో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్‌ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకోవచ్చు. కనుక బీఆర్ఎస్‌ పార్టీ ఈ పేరు విషయంలో ఏం చేయబోతోందనేది చాలా ఆసక్తికరం.

టీఆర్ఎస్‌ పార్టీ పేరుతో ఎలాగూ బీఆర్ఎస్‌ ఓటు బ్యాంక్ దెబ్బ తింటుంది. ఇంతకాలం బీఆర్ఎస్‌ పార్టీ పేరుని మళ్ళీ టీఆర్ఎస్‌ పార్టీగా మార్చాలని కోరుతున్న బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని, కవిత పార్టీనే ప్రజలు టీఆర్ఎస్‌ పార్టీ అని నమ్ముతారని భావిస్తే వలసలు మొదలవకుండా ఉంటాయా? మొదలైతే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులు ఆపగలరా?

చివరిగా ఒక్క మాట: ఆమె తన పార్టీ పేరు టీఆర్ఎస్‌ పార్టీ అని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీ మొట్ట మొదటి రియాక్షన్ చాలా ఘాటుగా ఉంటుందని అందరూ భావించడం సహజం.

కానీ ‘ఒరిజినల్ ఒరిజినలే…’ అంటూ కోల్గేట్ టూత్ పేస్ట్, బిస్లిరీ వాటర్ బాటిల్ బొమ్మలు, వాటి పక్కనే పేరులో చిన్న అక్షరాల మార్పుతో వాటి నకిలీ ఉత్పత్తులను పోస్ట్ చేయడం చాలా చవుకబారుగా ఉంది. బీఆర్ఎస్‌ పార్టీ తొలి స్పందన చూసినప్పుడు ‘రాజకీయాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలని’ కల్వకుంట్ల కవిత చెప్పిన మాటలు గుర్తు రాక మానవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Postponed: Naga Vamsi’s Deadline Drama Backfires

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 will miss its October 9 release. Producer Naga Vamsi confirmed…

3 minutes ago

వైసీపీ ‘కోర్టు’లలో యుద్ధం చేస్తుందా.?

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…

15 minutes ago