
గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాలు బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా సాగుతున్నప్పటికీ మూడో ప్రత్యామ్నాయం గా బీజేపీ కూడా నేను ఉన్నాను అంటూ తెలంగాణ రాజకీయాలకు గుర్తు చేస్తుంటది.
అయితే తెలంగాణ రాజకీయాలలో పార్టీల పరంగా ర్యాంకులు ఇస్తే అధికార కాంగ్రెస్ కి టాప్ -1 స్థానం దక్కగా, ప్రతిపక్ష బిఆర్ఎస్ నెంబర్ -2 లో ఉండగా ఆ నెంబర్ 3 లో ప్రస్తుతం బీజేపీ ఉన్నప్పటికీ కవిత తన తెరాస తో ఈ నెంబర్ గేమ్ లో మొదటి స్థానం కోసం ఆశపడుతున్నారు.
తెలంగాణ ప్రజలకు అమ్మగా ప్రచారం మొదలుపెట్టిన కవిత తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వెయ్యాలని ఆశపడుతున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇటు బిఆర్ఎస్ ప్రతిపక్ష బలాన్ని కలుపుకుని ముందుకెళ్లాలని కవిత భావిస్తున్నారు.
అందుకోసం ముందుగా ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ని రాజకీయంగా కిందకిలాగి ఆ స్థానంలో కవిత తన తెరాస పార్టీని ఉంచగలగాలి. అందుకోసం నిత్యం తెలంగాణ రాజకీయాలలో కవిత తెరాస పేరు మారుమోగాల్సి ఉంటుంది. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాలలో ప్రతి ఒక్క అంశాన్ని కవిత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఆ అంశం మీద తెరాస గళం వినిపించేందుకు సిద్దపడుతున్నారు.
ఇందుకు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోస్కో కేసు నుంచి తెలంగాణ రైతులు ఎదుర్కుంటున్న రైతు సమస్యల వరకు కవిత ప్రభుత్వ పై వేలెత్తి చూపుతున్నారు, గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అందుకోసం కేవలం సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టకుండా ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు.
తాజాగా నేడు రైతు సమస్యల పై కవిత తన పార్టీ తరుపున ప్రభుత్వం కు వ్యతిరేఖంగా నిరశన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం వద్ద తెరాస పార్టీ శ్రేణుల తో కలిసి ఆందోళన చేపట్టిన కవిత ను పోలీస్ అధికారులు అరెస్టు చేసి ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అజ్ఞాతాన్ని అలానే కొనసాగిస్తున్నారు, ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ సైతం విరామ రాజకీయాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు రేవంత్ సర్కార్ మీద దూకుడుగా ముందుకెళ్తున్నారు, మరికొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోతున్నారు.
ఇక బండి భగీరథ్ వివాదంతో టి. బీజేపీ ఊహించని రాజకీయ చిక్కులను ఎదుర్కొటుంది. ఇక అటు బిఆర్ఎస్ అజ్ఞాతాన్ని, ఇటు బీజేపీ మౌనాన్ని కవిత తెరాస తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మరి ఈ నెంబర్ గేమ్ లో కవిత తన తెరాస ను ఏ స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు అనేది చూడాలి.
The trailer for Anurag Kashyap’s new movie Bandar is out, and it is getting a…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ కూడా రెండుగా చీలిపోవడం యాదృచ్చికమే కావచ్చు. కానీ నాడు…