Telugu

కవిత vs బిఆర్ఎస్ మధ్య ‘వన్ సైడ్ వారేనా’.?

తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత చేసే రాజకీయ ప్రకటనలు తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. కవిత మీడియా ముందుకొచ్చారు అంటే అయితే ఒకటి ఆంధ్రా – తెలంగాణ అనే ప్రాంతీయవాద రాజకీయం లేకుంటే బిఆర్ఎస్ పై అవినీతి ఆరోణలు….ఇలా సాగుతుంది కవిత సీరియల్ రాజకీయం.

అయితే కవిత చేస్తున్న ఈ రాజకీయంతో బిఆర్ఎస్ కుడితిలో పడ్డ ఎలక మాదిరి గిలగిలా కొట్టుకుంటుంది. కవిత విమర్శలకు కౌంటర్ ఇస్తే మరికొన్ని బిఆర్ఎస్ అవినీతి గండి కోట రహస్యాలను తామే బయటపెట్టుకున్నట్టు అవుతుందని బిఆర్ఎస్ నేతలకు ఎరుకే.

ADVERTISEMENT

అలాని కవిత ఆరోపణలకు ఎటువంటి బదులు ఇవ్వకపోయినా మౌనం అర్ధాంగీకారం అనే భావన కలగడం ఖాయం. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ లో కనిపించే ఈ ఒక్క బలహీనతే కవిత విమర్శలకు మరింత బలంగా మారుతుంది. ఆ బలమే తండ్రి కేసీఆర్ ని ‘మరమనిషి’ అనేలా చేసింది, అన్న కేటీఆర్ ని ‘నాయకత్వ లక్షణాలు’ లేని నేతగా ప్రచారం చేస్తుంది, ఇక మామ హారిష్ ని ‘గుంటనక్క’ గా చిత్రీకరిస్తుంది.

కవిత ఇలా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మాజీ మంత్రుల వరకు అందరి పై రెచ్చిపోతున్నా బిఆర్ఎస్ నుంచి కవిత కు ఇంతవరకు సరైనా కౌంటర్ పడలేదని చెప్పాలి. దీనితో కవిత ఏకంగా హరీష్, కేసీఆర్ టార్గెట్ గా క్షుద్రపూజలు చేస్తారని, అది ఆయన అలవాటు అనే స్థాయికి వెళ్ళిపోయింది. అయినా కూడా కవిత ను టార్గెట్ చేసేందుకు బిఆర్ఎస్ ముందుకు రాలేకపోతుంది.

తాజాగా నిజామాబాద్ పాంచజన్యం సభ లో కవిత బిఆర్ఎస్ టార్గెట్ గా మరికొన్ని ఆరోపణలు చేసారు. అందుకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై కవిత విమర్శలు సంధించారు. అయితే కవిత తన పై చేసిన విమర్శలకు ప్రశాంత్ కౌంటర్ ఇచ్చేందుకు, కవిత పై ఎదురుదాడి చేసేందుకు మీడియా ముందుకొచ్చారు.

కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని, కష్టకాలంలో కేసీఆర్ కి అండగా ఉంది కవితా.? తానా.? అని, కవిత చేస్తున్న ఈ రాజకీయంతో కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో కవిత ఊహించారా.? అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుమార్తెగా కవిత కు ఉన్న ఆ కాస్త గౌరవం, మర్యాద కూడా కవిత పోగొట్టుకుంటున్నారంటూ వాపోయారు.

అలాగే తానూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రహస్య మంతనాలు చేశానంటూ కవిత చేసిన విమర్శల పై కూడా ప్రశాంత్ బదులు చెప్పారు. తానూ కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరితో ఎటువంటి మంతనాలు చెయ్యలేదని నరసింహస్వామి సాక్షిగా చెపుతున్నా,అలాగే రహస్యంగా కాంగ్రెస్ నేతలను కలవలేదని కవిత చెప్పగలరా.? అంటూ కవిత పై ఎదురుదాడి చేసారు ప్రశాంత్ రెడ్డి.

బిఆర్ఎస్ లో కవిత రెండు సార్లు ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు తన పాత్ర ఏమిటో కేసీఆర్ కి తెలుసునని, తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ పైనే రాజకీయ ఆరోపణలు చేసిన కవిత తన పై రాజకీయ విమర్శలు చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేదంటూ కవితకు సాఫ్ట్ గా కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి.

అయితే కవిత బిఆర్ఎస్ నేతల పై చేసే విమర్శలు చాల సూటిగా, ఘాటుగా ఉంటాయి, కానీ బిఆర్ఎస్ నుంచి కవిత పై వచ్చే విమర్శలు ఇలా సాఫ్ట్ గా చప్పగా సాగుతుండడంతో కవిత vs బిఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ వార్ ప్రస్తుతానికి కవిత చేస్తున్న వన్ సైడ్ వార్ లానే కనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

హీరోయిన్ల బొడ్లు బ్లర్ చేయించారట.. ఇదేం చోద్యం

రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…

6 minutes ago

ఆగస్టు రిపోర్ట్: ఇరుముడి జోరు.. టాక్సిక్ బేజారు!

ఆగస్టులో సినిమాలకు కొదవ లేదు. ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు తమిళం నుంచి రెండు చెప్పుకోదగ్గ సినిమాలు, కన్నడ…

18 minutes ago