Telugu

కవిత పై బిఆర్ఎస్ నిశ్శబ్దం..ఇది కూడా వ్యూహమేనా.?

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకు రాకముందు నుంచి గులాబీ కారు పై కవిత ఎక్కుపెడుతున్న అస్త్రాలు, ఆ పార్టీ ముఖ్య నేతల కేంద్రంగా ఆమె గురి పెడుతున్న బాణాలు బిఆర్ఎస్ పై ఎటువంటి రాజకీయ ప్రభావాన్ని చూపడం లేదా.?

ఇక సస్పెన్షన్ వేటు తరువాత గుంపు మేస్త్రి, గుంటనక్క, గూఢాచారి అంటూ కవిత పెడుతున్న ప్రెస్ మీట్లు, బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు కూడా గులాబీ జెండాలో చలనం కలిగించలేకపోతున్నాయా.? ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా కవిత సంధిస్తున్న విమర్శలు బిఆర్ఎస్ ని బయపెట్టలేకపోతున్నాయా.?

ADVERTISEMENT

కేటీఆర్ బయటకొచ్చి మాట్లాడుతున్న ప్రతి అంశంలోనూ కవిత కేటీఆర్ కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు, కేటీఆర్ చర్యలను తప్పుబడుతూనే పోతున్నారు. అయినా కూడా కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు అందరు మౌన ముద్రలోనే ఉంటున్నారు కానీ కవిత పై విమర్శలకు ముందుకు రాలేకపోతున్నారు.

బిఆర్ఎస్ అసలు కవితను తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తుందా.? లేదా కవిత జాగృతిని కూడా షర్మిల టి . వైసీపీ మాదిరి భావిస్తున్నారా.? లేక తమ ప్రతిదాడి తో కవిత ను మరింత రెచ్చకొడితే అది బిఆర్ఎస్ కి అత్యం ప్రమాదకరంగా

మారుతుందనే భయమే బిఆర్ఎస్ ని నిశ్శబ్దంలో ఉంచుతుందా.?

గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాగమైన కవిత, కేసీఆర్ కుటుంబంలో ఒకరు, దీనితో బిఆర్ఎస్ లోగుట్టు, కల్వకుంట్ల ఇంటి గుట్టు మొత్తం కవిత చేతిలో ఉండడమే బిఆర్ఎస్ నిశ్శబ్ద వ్యూహానికి ఊతమిస్తుందా.? ఇప్పటికే ఇలా ఇంటి గుట్టు రట్టు చేసి ఏపీలో షర్మిల వైసీపీ పతనానికి ఒక కారణంగా నిలిచారు, ప్రత్యర్థి కూటమికి ఒక ఆయుధమయ్యారు.

ఇటువంటి తరుణంలో కవిత పట్ల బిఆర్ఎస్ నేతల ఆవేశం బిఆర్ఎస్ పతనానికి పునాదులేస్తుందనే భావన బిఆర్ఎస్ అధినాయకత్వానికి అడ్డుపడుతుందా.? అందుకే కవిత విమర్శలకు, ఆమె చేస్తున్న బిఆర్ఎస్ నేతల వ్యతిరేక ప్రకటనలను బిఆర్ఎస్ లైట్ తీసుకుని, చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anurag Kashyap Joins Chiranjeevi’s Kaaka

The team of Megastar Chiranjeevi’s actioner Kaaka, directed by Bobby Kolli and produced by Venkat…

15 minutes ago

Better To Retire Now? RCB Legend Drops Brutal Verdict

Mohammed Shami’s India return has already been a big talking point, but Dinesh Karthik’s latest…

28 minutes ago