Telugu

బిఆర్ఎస్ సందట్లో సడేమియా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కవిత చేసిన వ్యాఖ్యలకు టి. జనసేన నేతలు, పవన్ అభిమానులు కవిత పై సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. పవన్ చెరువును కబ్జా చేసారని, ఆ 10 ఎకరాల కబ్జా భూమి శిఖం భూమి పరిధిలోకి వస్తుందంటూ ఆరోపించారు కవిత.

అయితే తన స్థలం పై ఎదురవుతున్న వివాదల నేపథ్యంలో రేవంత్ సర్కార్ విచారణ జరపవచ్చని, ఆ విచారణలో అది అక్రమమని తేలితే స్వచ్ఛందంగా దానిని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవచ్చని పవన్ బహిరంగంగా ప్రకటించారు. పవన్ ప్రకటనకు తగ్గట్టే కవిత పవన్ వెంటనే తన మాటకు కట్టుబడి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలంటూ డిమాండ్ చేసారు.

ADVERTISEMENT

అలాగే తెలంగాణ మీ అయ్యా జాగీరు కాదని, మీ తాత జాగీరు కాదని, ఇది మా జాగీరు, మా తెలంగాణ ఉద్యమకారుల జాగీరు అంటూ పవన్ పై రెచ్చిపోయారు. కవిత పవన్ టార్గెట్ గా చేసిన విమర్శలకు కౌంటర్ గా జనసైనికులు, పవన్ అభిమానులు కవిత గత చరిత్రను తవ్వి బయటకు తీస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునే కవిత ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యిందని, విలాసమైన ప్యాలస్ లు, ఎకరాల, ఎకరాల ఫామ్ హౌస్ లు ఎలా నిర్మించారని, ఆ డబ్బెక్కడిదని, బిఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ సాధ్యం ఆకలేదు కానీ కల్వకుంట్ల కుటుంబం బంగారంగా ఎదిగిందన మాట వాస్తవం కాదా అంటూ కవిత పై విమృషలు ఎక్కుపెట్టారు.

ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానాలు చేసిన తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఇప్పటికి అవే బతుకులు బతుకుతుంటే ఉద్యమ సమయంలో తండ్రి పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాలలోకి వచ్చిన కవిత మాత్రం వందల కోట్లు సంపాధించిందన్నారు.

అలాగే పవన్ శిఖం భూమిని కబ్జా చేశాడంటూ ఇప్పుడు ఆరోపిస్తున్న కవిత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నోరెత్తలేకపోయారని, అప్పుడెందుకు పవన్ భూమి పైన విచారణ జరపలేకపోయారంటూ కవిత ను నిలదీస్తున్నారు.

తెలంగాణ ఆడబిడ్డగా, రాజకీయాలలోకి ఉన్న కవిత వేలకోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి తీహార్ జైలుకు వెళ్లడం తెలంగాణ సమాజానికి అప్రదిష్ట కాదా.? అంటూ కవిత పై విరుచుకుపడుతున్నారు జనసైనికులు. ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా బిఆర్ఎస్ మద్దతుదారులు సైతం కవిత టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.

తండ్రికి వెన్నుపోటు పొడిచి, అన్న పై రాజకీయ ఆధిపత్యం కోసం బిఆర్ఎస్ ను వదిలి తెరాస 2.0 అంటూ వచ్చిన కవిత ముందుగా తన పై ఎదురవుతున్న లిక్కర్ స్కాం అవినీతి ఆరోపణలకు ప్రజలకు సమాధానం చెప్పాలని, ఇన్నాళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎంపీ గా, ఎమ్మెల్సీ గా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ ఓటమి పాలైతే తండ్రని ఎదిరించి అన్న ను కాదని బిఆర్ఎస్ పై రాజకీయ విమర్శలు చేస్తున్నారా.? అంటూ కవిత ను టార్గెట్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

2 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

2 hours ago