
బిఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల ఇంటి ఆడపడుచుల పోరు తప్పదా అనేలా నాడు తెరాస కు కేసీఆర్ అన్న కుమార్తె రమ్యా రావు నుంచి తిరుగుబాటు ఎదురవగా, నేడు బిఆర్ఎస్ కు కేసీఆర్ కన్న కూతురు కవిత నుంచి ఎదురుదాడి మొదలయ్యింది.
ఇలా కేసీఆర్ గులాబీ కారుకి, కల్వకుంట్ల కుటుంబానికి ఇంటి ఆడపడుచులు స్పీడ్ బ్రేకర్ల మాదిరి తయారవుతున్నారు. నాడు తెరాస లో రమ్యా రావు ప్రస్థానం ముగియడానికి నేడు బిఆర్ఎస్ నుండి కవిత సస్పెన్షన్ తో బయటకు వెళ్లాడనికి ముఖ్య కారణం సంతోషే కావడం ఇక్కడ విశేషం.
నాడు రమ్యా రావు సైతం కేసీఆర్ ను కలిసేందుకు సంతోష్ తనకు అడ్డంకి గా మారారని, ఒక అటెండర్ పోస్టుకు కూడా సరిపోని వ్యక్తి కి కేసీఆర్ రాజ్యసభ ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో లేని వ్యక్తి ఇప్పుడు పార్టీ నిర్ణయాలను ప్రలోభ పెట్టగలుగుతున్నారంటూ సంతోష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ కంటిలో నలుసయ్యారు.
ఆ ఆరోపణల ఫలితమే రమ్యా రావు తెరాస కు దూరం కాకతప్పలేదు, కేసీఆర్ కు ప్రత్యర్థిగా మారక తపప్లేదు. ఎవరో మాటలను బేరీజు వేసుకుని తన బాబాయ్ కేసీఆర్ తనకు పార్టీలో అన్యాయం చేసారంటూ తెరాస కు రాజీనామా చేసిన రమ్యా రావు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే నాడు రమ్యా రావు కి సైతం పార్టీలో ప్రముఖ గుర్తింపు కానీ గౌరవప్రదమైన పదవి కానీ దక్కలేదనేది రమ్యా రావు వాదన.
అయితే ఇప్పుడు కవిత ది కూడా ఇంచు మించు ఇదే తరహా ఆవేదన. తన తండ్రి స్థాపించిన పార్టీ ఎన్నో దశాబ్దాల పోరాటాల తరువాత పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ పదవులలో కానీ ప్రభుత్వంలో కానీ తనకు సముచిత స్థానం దక్కలేదనేది కవిత ఆవేదన. ఆ ఆవేదనే నేడు ఆక్రోశంగా మారి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా గళం విప్పే స్థాయికి చేరింది.
అయితే ఇందుకు కారణం కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే అనేది కవిత ఆరోపణ. నాడు రమ్యా రావు మాదిరే నేడు కవిత కూడా తన ఈ స్థితికి ముఖ్య కారణం హరీష్ తో పాటు సంతోష్ కూడా అంటూ ఆరోపిస్తున్నారు.
అయితే అటు అన్న కూతురు ని కాదని, ఇటు కన్న కూతురు ని వద్దనుకునేలా కేసీఆర్ ను ఆ స్థాయిలో ప్రభావితం చెయ్యగలుగుతున్న ఆ సంతోష్ అసలు ఎవరు.? ఆయన పార్టీలోకి ఎలా వచ్చారు.? కేసీఆర్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఎలా ఎదిగారు అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…