Telugu

ఆ హీరోయిన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది!

ప్రముఖ మలయాళ నటి భావనపై కారులో జరిగిన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే స్టార్ హీరో దిలీప్ అరెస్టై, బెయిల్ లభించిక ఇబ్బందులు పడుతుండగా, అతని రెండో భార్య, సినీ నటి కావ్య మాధవన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ పోలీసు విచారణలో తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ‘మేడం’ ఆదేశాల మేరకే భావనను కారులో లైంగికంగా వేధించి, బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఫోటోలు, వీడియోలు తీశానని తెలిపాడు.

ఈ ఆదేశాలు ఇచ్చి, డబ్బులు సమకూర్చిన ‘మేడం’ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని స్పష్టం చేశాడు. అయితే ఆమె ఆదేశాలు ఇవ్వడం, డబ్బు సమకూర్చడం మినహా మరేదీ చేయలేదని అన్నాడు. అయితే ఆమె పేరు, వివరాలు మాత్రం చెప్పేందుకు మాత్రం పల్సర్ సునీ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ‘మేడం’ దిలీప్ రెండో భార్య కావ్యా మధవన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దిలీప్, కావ్య మాధవన్ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో భావన వారిద్దరి లక్ష్యమైందని మాలీవుడ్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

అయితే అసలు పల్సర్ సునీ ఎవరో తనకు తెలియదని కావ్య మాధవన్ చెబుతుండడంపై అతను మండిపడ్డాడు. కావ్యకు తానెవరో తెలియదనడం మూర్ఖత్వమని, ఆమెకు తాను బాగా తెలుసని, ఆమె అబద్ధమాడుతోందని పల్సర్‌ సునీ పోలీసులకు స్పష్టం చేసారు. దీంతో ఇప్పటికే అరెస్ట్ అయిన హీరో దిలీప్ తో పాటు కావ్య మాధవన్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయన్న అభిప్రాయం మాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Devudichhina Annayya: Lokesh’s Hearty Wish To PK!

Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…

35 minutes ago

Paradise 22 Days Left: Can Odela Avoid Toxic Mistakes?

Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…

1 hour ago