కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈసారి ఎదురీత తప్పదా?

నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఈసారి తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నారు.

దీనికి బలమైన కారణమే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ప్రభుత్వం వరకు ఆయన వెన్నంటే నడిచిన ఈటల రాజేందర్‌ను ఆయన అవమానకరంగా మంత్రి పదవి నుంచి తొలగించారు. దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలలో పోటీ చేశారు.

ADVERTISEMENT

ఆ ఉపఎన్నికలలోనే ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేయాలనే ఉద్దేశ్యంతో, కేసీఆర్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలందరినీ 3-4 నెలల పాటు హుజూరాబాద్‌లోనే మోహరించారు. అంతేకాదు… హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్నందున అప్పటికప్పుడు హడావుడిగా దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు.

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటల రాజేందర్‌ని ఓడించలేకపోయారు. ఆ ఉపఎన్నికను కేసీఆర్‌ వ్యక్తిగతంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి పోరాడటంతో బిఆర్ఎస్ అభ్యర్ధి కాక, ఆయనే ఈటల రాజేందర్‌ చేతిలో దారుణంగా ఓడిపోయిన్నట్లు అందరూ భావించారు.

తనకు తిరుగే లేదని భావించే కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ పెద్ద షాక్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో తాను గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్‌ని ఓడిస్తానని ఈటల రాజేందర్‌ శపధం చేశారు. బహుశః ఆ భయంతోనేమో తెలీదు కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు.

అప్పటి నుంచి కేసీఆర్‌ తనను చూసి భయపడి కామారెడ్డికి పారిపోతున్నారని ఈటల రాజేందర్‌, బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.

అయితే ఈటల రాజేందర్‌ ఈసారి హుజూరాబాద్‌ నుంచి మాత్రమే పోటీ చేస్తారనే వార్తలు వస్తుండటంతో, ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు కూడా “గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్నారుగా? కేసీఆర్‌ని ఓడిస్తానన్నారుగా? ఏమి భయపడుతున్నారా?” అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు.

వాటిపై ఈటల రాజేందర్‌ ఈరోజు స్పందిస్తూ, “ఇక్కడ (హుజూరాబాద్‌) నుంచే కాదు అక్కడ (గజ్వేల్) నుంచి కూడా పోటీ చేస్తా…తగ్గేదేలే,” అని జవాబు ఇచ్చారు. మొదటి నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, పార్టీలో, ప్రభుత్వంలో కూడా పనిచేసినందున ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ బలాలు, బలహీనతలు, ఆయన ఆలోచనలు, ఎత్తుగడలు ఏవిదంగా ఉంటాయో బాగా తెలుసు. కనుకనే హుజూరాబాద్‌లో గెలవగలిగారు. ఒకవేళ గజ్వేల్‌లో పోటీ చేసి కేసీఆర్‌ని కూడా ఓడించగలిగితే లేదా ఎదురీదేలా చేయగలిగినా ‘కేసీఆర్‌కు తిరుగేలేదనే’ పేరుకు భంగం కలుగుతుంది. బహుశః అందుకే కేసీఆర్‌ కామారెడ్డిని కూడా ఎంచుకొని ఉండవచ్చు. ఒకవేళ ఈటల రాజేందర్‌ కూడా ఆఖరి నిమిషంలో గజ్వేల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన విరమించుకొంటే కేసీఆర్‌కు ఈ ఇబ్బంది తప్పుతుంది. లేకుంటే సొంత నియోజకవర్గంలో కూడా ఈటల రాజేందర్‌తో భీకర యుద్ధం చేయక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

13 minutes ago

సినిమా వాళ్ళకు మూడు పాఠాలు.. అవసరమే!

బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…

27 minutes ago