కేసీఆర్‌ ఎన్టీఆర్‌ని తలుచుకున్నారు కానీ…

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ చాలా వేగంగా ఖాళీ అయిపోతుండటంతో కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను కలవడానికి కూడా ఇష్టపడని కేసీఆర్‌ ఇప్పుడు సామాన్య కార్యకర్తలను కూడా తన ఫామ్‌హౌస్‌కి పిలిపించుకొని “మీ అందరినీ మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను… మీకు ఎటువంటి సమస్యలున్నా నాతో చెప్పుకోండి కానీ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోకండి,” అని ప్రాధేయపడుతున్నారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌ ప్రస్తావన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫామ్‌హౌస్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు ఎన్టీఆర్‌ కూడా ఇలాగే ఓటమి చవి చూసినప్పుడు ధైర్యంగా ప్రజల మద్య వెళ్ళి వారి అభిమానం సంపాదించుకొని మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అలాగే మనం కూడా కష్టపడి పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాము,” అని కేసీఆర్‌ చెప్పారు.

నిజానికి కేసీఆర్‌ పోరాట స్పూర్తి గురించి చెప్పుకోవాలంటే తన చేతిలో నలిగిపోయిన కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో అది చేసిన అలుపెరుగని పోరాటాలు గురించి చెప్పుకోవలసి ఉంటుంది.

తమలో తామే కుమ్ములాడుకుంటూ తన నాయకత్వాన్ని కూడా అంగీకరించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేతలనే రేవంత్‌ రెడ్డి సైన్యంగా చేసుకొని కేసీఆర్‌ని ఓడించడం చాలా గొప్ప విషయం. కానీ ఇది అంగీకరించడానికి కేసీఆర్‌ అహం అడ్డొస్తోంది లేకుంటే రేవంత్‌ రెడ్డిలా మనమూ పోరాడాలని కేసీఆర్‌ చెప్పేవారే.

అదేవిదంగా ఏపీలో జగన్‌ వేధింపులని భరిస్తూ కూడా చంద్రబాబు నాయుడు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన తీరు, పార్టీని కాపాడుకున్న తీరు, జగన్‌ ఎత్తులకి పైఎత్తులు వేస్తూ ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించిన తీరుని కూడా కేసీఆర్‌ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు వివరించి మనం కూడా చంద్రబాబు నాయుడులాగా పోరాడాలని చెప్పవచ్చు. కానీ దానికీ అహం అడ్డు వస్తుంది. కనుక తమిళనాడులో ద్రవిడ పార్టీలు మనకి ఆదర్శం అని చెప్పుకుంటున్నారు.

గమ్మతైన విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు కష్టకాలంలో కోర్ రాజకీయాలు విడిచిపెట్టకుండా పోరాడుతూ మళ్ళీ అధికారంలోకి రాగలిగారు కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని తన ప్రభుత్వాన్ని కూల్చేసి షార్ట్ కట్‌లో ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్నారని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ని ఎద్దేవా చేశారు.

అంటే చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోమని కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి చెపుతున్నారన్న మాట. కానీ ఆయనకు అహం అడ్డొస్తోంది కనుక ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకోవాలని చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తన విధానం కంటే ఇతరుల విధానాలే సరైనవని కేసీఆర్‌ మనసులోనైనా ఒప్పుకునే తీరాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ 10 డీఎస్సీ కాదు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే!

జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…

5 minutes ago

Is Rashmika Mandanna India’s No. 1 Actress?

Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…

33 minutes ago