రేవంత్‌కి కలలో కూడా కేసీఆర్‌… మరి కేసీఆర్‌కి?

శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ విద్యార్ధి విభాగంతో హరీష్ రావు సమావేశమయ్యారు. కనుక అయన వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటి కోసం పోరాడుతామని చెపుతారనుకుంటే, అక్కడ కూడా బనకచర్ల రికార్డ్ వేశారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి నీళ్ళను ఏపీకి అప్పగించేస్తున్నారని, దీని వలన తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని హరీష్ రావు చెప్పారు.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డి తెలంగాణ నిధులు కాంగ్రెస్‌ అధిష్టానానికి, నీళ్ళు ఆంధ్రాకు పంచేస్తున్నారని హరీష్ రావు అన్నారు. కనుక గురు శిష్యులు ఇద్దరూ కలిసి తెలంగాణకు చేస్తున్న ఈ అన్యాయం గురించి ప్రజలను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి కలలో కూడా కేసీఆర్‌ పేరు తలచుకొని ఉలిక్కి పడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఇక్కడ భద్రాచలం గురించి కొంచెం చెప్పుకోవాలి. ప్రస్తుతం గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో భద్రాచలంలో నీటి మట్టం 32.5 అడుగులకు చేరింది. దీంతో స్నానాల ఘాట్‌ల మెట్లు మునిగిపోయాయి. ఏటా వర్షా కాలంలో గోదావరి ఉప్పొంగి ప్రవహించినప్పుడు పట్టణంలోకి నీళ్ళు చేరుతుంటాయి.

గత ఏడాది ఆలయం కొండ దిగువన మోకాలు లోతు నీళ్ళు చేరాయి. కనుక ఈసారి ఆవిధంగా జరుగకుండా నివారించేందుకు పంపులు ఏర్పాటు చేశారు. అంటే గోదావరి గట్టిగా ప్రవహిస్తే ఆ నీటిని వాడుకోలేక, నిలువచేసుకోలేక దిగువకు విడిచిపెట్టేస్తున్నారన్న మాట.

ఆ విదంగా ఏపీలోకి వస్తున్న గోదావరి వరద నీటిని రాయలసీమకు మళ్ళించాలని సిఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తే తెలంగాణకు అన్యాయం అయిపోతోందంటూ హరీష్ రావు ఈవిదంగా విద్యార్ధులను కూడా ఎగదోసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.

సిఎం రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆర్‌ని తలుచుకొని ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేస్తున్న హరీష్ రావు, ఈ సమావేశంలో కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటున్నారు కదా?

కానీ కేసీఆరే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను చూసి భయపడి ఫామ్‌హౌసులో దాక్కోన్నారని అంటే హరీష్ రావు వద్ద సమాధానం ఉందా?సిఎం రేవంత్ రెడ్డి పదేపదే సవాలు చేస్తున్నా కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదో హరీష్ రావు చెప్పగలరా?

తెలంగాణలో ప్రవహిస్తున్న నీటిని వాడుకోలేక, నిలువ చేసుకోలేక దిగువకు విడిచిపెట్టేస్తుంటే అందుకు హరీష్ రావు తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీయాలి. కానీ రేవంత్ రెడ్డిని విమర్శించే వంకతో చంద్రబాబు నాయుడు పేరుని ముడిపెట్టి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు కాదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

4 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

4 hours ago