
తెలంగాణకు కూడా గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు వగైరా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చింది కానీ అమలుచేయలేదు. అయితే వాటి కోసం తెలంగాణ ప్రభుత్వం, బిఆర్ఎస్ ఎంపీలు గత 9 ఏళ్ళుగా కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడుగుతూనే ఉన్నారు. విభజన హామీలు అమలుచేయకుండా తెలంగాణ ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని, తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని గట్టిగా వాదిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, బిఆర్ఎస్ ఎంపీల ఒత్తిడి, వీటి పేరుతో బిఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో తెలంగాణలో బీజేపీ తీవ్రంగా నష్టపోతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ ఒకటొకటిగా మంజూరు చేస్తూనే ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నప్పుడు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు గట్టిగా వాదిస్తూ, రాష్ట్రానికి ఒకటొకటిగా అన్ని సాధించుకొంటున్నారు. కానీ ఆంధ్రాకు ఇచ్చిన విభజన హామీలను ఎందుకు అమలుచేయడం లేదని కేంద్రాన్ని నిలదీసి అడిగే నాధుడే లేకుండా పోయాడు!
వైసీపికి 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ, అమిత్ షాల ముందు తలదించుకొని నిలబడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. టిడిపి, జనసేనలు కూడా వేర్వేరు కారణాల వలన వారి ప్రాపకం కోసం ప్రాకులాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ కేంద్రంపై కత్తులు దూస్తూ రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకొంటుంటే, ఏపీలో మూడు ప్రధానపార్టీలు మోడీ, అమిత్ షాలకు వీరవిధేయంగా ఉంటున్నా ఏ ఒక్కటీ సాధించుకోలేకపోతున్నాయి. పైగా వాటి కళ్ల ముంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తోంది కూడా!
తెలంగాణ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ అన్నిటినీ పోరాడి సాధించుకొంటుంటే, మనం కనీసం స్టీల్ ప్లాంట్‌ని కూడా కాపాడుకోలేని దుస్తితిలో ఉన్నాము!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటే, మనం సంక్షేమ పధకాలు, అప్పులు, విద్వేష రాజకీయాలలో మునిగిపోతునే ఉన్నాము. దీనికి ఎవరిని నిందించాలి?
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…