
ఓ పెద్ద సినిమాకి రిలీజ్ ముందు ఏవిధంగా హైప్ క్రియేట్ చేసుకుంటారో, అదేవిధంగా కేసీఆర్ ఫామ్‌హౌసు గడప దాటి బయటకొస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకు చాలా హైప్ క్రియేట్ చేస్తుంటుంది.
నిన్న జరిగిన జగిత్యాల సభకు వారం రోజుల ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ‘ప్రమోషన్స్’ మొదలుపెట్టెసింది. ‘కేసీఆర్ వస్తున్నారు… రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు భయంతో గజగజ వణికిపోతున్నారంటూ’ డబ్బా కొట్టుకుంది.
చివరికి నిన్న ఆయన ఫామ్‌హౌసులో నుంచి బయలుదేరినప్పటి నుంచి సభా వేదికకు చేరుకునే వరకు బీఆర్ఎస్ ‘ప్రమోషన్స్’ అద్భుతంగా సాగాయి. ఆయన ఫామ్‌హౌసు గడప దాటి కాలు బయట పెట్టడమే తెలంగాణ ప్రజల అదృష్టమన్నట్లు, కాంగ్రెస్ పార్టీకి మూడినట్లు గొప్పగా ఎలివేషన్స్ ఇచ్చింది.
కనుక ఇన్ని ప్రమోషన్స్, ఇంత హైప్, ఇంత ఎలివేషన్స్, ఇంత గ్రాండ్‌గా ‘ప్రీ-రిలీజ్’ నిర్వహించినప్పుడు, జగిత్యాల సభలో కేసీఆర్ ఇరగదీసేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ ఎప్పటిలాగే అదే అహంభావం.. ప్రత్యర్ధుల పట్ల అదే చులకన మాటలు… అదే సొంత డబ్బా.. అవే విమర్శలతో ‘మమ’ అనిపించారు. ఈసారి సభలో కేసీఆర్ వాల్యూం కాస్త గట్టిగా వినబడింది కానీ వాటిలో కంటెంట్ లేదు.
ముందుగా కూతురు కల్వకుంట్ల కవిత రాజకీయాలు, ఆమె కొత్త పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ వైఖరిని విస్పష్టంగా చెప్తారనుకుంటే ఆమె ఊసే ఎత్తలేదు. గతంలో ప్రతీరోజూ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం, బిజేపి మతతత్వంపై కత్తులు దూసిన కేసీఆర్ నిన్నటి సభలో వాటి ఊసెత్తలేదు. ఎందువల్ల?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల ఫెయిల్ అయ్యింది కనుక ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ నమ్మకంగా చెప్పారు. దీని కోసం ఆయన తన భాష, యాస, సామెతలను చాలా చక్కగా, చాలా సమర్ధంగా ప్రయోగించారు.
కానీ అదే సమయంలో వేరే జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సభలో, సిఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కనీయను,” అని శపథం చేశారు.
గత ఎన్నికల మొదలు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకు కేసీఆర్ జోస్యాలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. కానీ సిఎం రేవంత్ రెడ్డి శపధాలు నిజమవుతూనే ఉన్నాయి.
కనుక ఈ శపథం కూడా నెరవేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి బుర్రలో ఏదో బలమైన ప్లాన్ ఉండే ఉంటుందనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పదవి, అధికారం దక్కించుకోవడానికి కేసీఆర్ వద్ద కొత్త ఆలోచన ఏమైనా ఉందా? ఉంది. దాని గురించి మరో ఆర్టికల్లో చెప్పుకుందాం!
Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…
హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…