దాచుకోలేనంత ప్రేమ, ద్వేషం… ఏం చేస్తాం!

సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాకు చెందిన రాజకీయ నాయకులు తెలంగాణ రాజకీయ నాయకులను డామినేట్ చేస్తూ రాజకీయాలు చేశారనేది వాస్తవం. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్‌ ఇద్దరూ ఆంధ్రాకు తరలి వచ్చేసి ఏపీ రాజకీయాలకే పరిమితమయ్యారు. షర్మిల కూడా ఏపీకి తిరిగి వచ్చేశారు. ఎన్నికలలో తప్ప పవన్ కళ్యాణ్‌ తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు.

సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని మళ్ళీ పునర్నిర్మించుకొని బలోపేతం చేయాలని అనుకున్నారు. కానీ ఇటు ప్రభుత్వ నిర్వహణ, అటు రాష్ట్ర రాజకీయాలతో క్షణం తీరిక లేకపోవడంతో ఆ పని చేయలేకపోతున్నారు.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్ రావు వంటి వారు ఏదో సందర్భంలో ఆంధ్రా రాజకీయాలలో వేలు పెడుతూనే ఉన్నారు. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, జగన్‌ ఇద్దరూ ఆంధ్రాకు చెందిన రాజకీయ నాయకులే. కానీ కల్వకుంట్ల కుటుంబం జగన్‌ని తమ శాశ్విత మిత్రుడుగా, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని శాశ్విత శత్రువుగా పరిగణిస్తుంటుంది!

కనుక జగన్‌ పట్ల ప్రేమని, చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషాన్ని వారు మనసులో దాచుకోలేక సమయం చిక్కినప్పుడల్లా బయట పెట్టుకుంటూనే ఉంటారు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని, బీజేపిని అడ్డుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మేమే తీసుకుంటామని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణ ప్రజలందరూ మా పార్టీకే ఓట్లు వేసి గెలిపించి, మాకు తిరిగి అధికారం అప్పగించండని కేసీఆర్‌ పదేపదే చెపుతుంటారు.

తెలంగాణ దిగువన ఉన్న ఆంధ్రా నుంచి చంద్రబాబు నాయుడు కృష్ణా, గోదావరి నీళ్ళని ఎత్తుకుపోతున్నారని కల్వకుంట్ల నేతలు వాదిస్తుంటారు.

చంద్రబాబు నాయుడుపై ఇంతగా విషం కక్కుతున్నా ఆయన అసలు పట్టించుకోకపోవడంతో వారికి ఆయనంటే ఇంకా అలుసుగా అనిపిస్తుంది. కానీ అలుసుగా భావిస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయగలరో 2023 శాసనసభ ఎన్నికలలో కల్వకుంట్ల కుటుంబం అనుభవపూర్వకంగా గ్రహించింది.

కానీ తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ కొలుకొని అధికారంలోకి రావాలంటే, చంద్రబాబు నాయుడి నామస్మరణతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన భజన మానుకోలేకపోతున్నారు.

అదే.. జగన్‌ గురించి మాట్లాడాల్సివస్తే కల్వకుంట్ల కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ పాలు పొంగిన్నట్లు ఆయనపై ప్రేమ పొంగిపోతుంది.

కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వ్యూలో “ఏపీ రాజకీయ నాయకులలో జగన్‌ని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన అలుపెరుగని ఓ గొప్ప పోరాట యోధుడు. పవన్ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి ఎలా అయ్యారో నేటికీ నాకు అర్దం కాదు,” అని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తుండటాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్‌ని కూడా ఎందుకు ద్వేషిస్తున్నారు?అంటే కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

· సరిగ్గా తాము ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పుడే, రాజకీయాలకు పనికి రాడని ముద్ర వేసేసిన పవన్ కళ్యాణ్‌ అనూహ్యంగా రాణించి ఏపీకి ఉప ముఖ్యమంత్రి అవడం.

· బీజేపితో కలిసి తెలంగాణ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుండటం.

· ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు కావడం, తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం.

· జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌ విఫలమవగా, ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్‌ తమిళనాడు రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం.

జగన్‌, కేసీఆర్‌ వంటివారు అహంభావం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రాజకీయాలు చేస్తూ ఎదురుదెబ్బలు తింటున్నారు. ఈ విదంగా తమ రాజకీయ ప్రత్యర్ధుల ఎదుగుదలని చూసి ఇంకా ఈర్ష్య చెందుతుంటే, మీ ఏడుపులే మాకు దీవెనలనుకుంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ వారిని ఏమాత్రం పట్టించుకోని ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉన్నారు. వారి ఏడ్పులు ఆగవు.. వీరి ఎదుగుదల ఆగదు. ఏం చేస్తాం!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

13 minutes ago

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

30 minutes ago