
కేంద్ర ఎన్నికల కమీషన్, న్యాయ నిపుణుల సలహా మేరకు టిఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా మార్చబోతున్నట్లు చెప్పారు. పార్టీ జెండా ఎప్పటిలాగే గులాబీ రంగులోనే ఉంటుందని కానీ మద్యలో టిఆర్ఎస్ పార్టీ చిహ్నామైన కారు బొమ్మకు బదులు భారతదేశం చిత్రపఠం ఉంటుందని తెలిపారు. అయితే జాతీయపార్టీకి కారు బొమ్మే ఎన్నికల చిహ్నంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నికలలో కొత్త జెండాతో జాతీయపార్టీగానే పోటీ చేయబోతున్నట్లు సిఎం కేసీఆర్ నిన్ననే ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 9న కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఢిల్లీలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించేముందు, ఆయనకు ఓ అగ్నిపరీక్ష ఎదుర్కొనున్నారు. మరోవిదంగా చెప్పాలంటే ఆయన తనకు తానే ఈ అగ్నిపరీక్ష పెట్టుకొన్నారని చెప్పవచ్చు. అదే… మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం. ఈరోజే మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.
ఈనెల 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ మొదలవుతుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఫలితాలు వెలువడతాయి. కనుక కేసీఆర్ తన సొంత విమానంలో జాతీయ రాజకీయాలలో ల్యాండింగ్ అయ్యే ముందు ఈ ఉపఎన్నికలలో ఘన విజయం సాధించడం చాలా అవసరం లేకుంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లవుతుంది.
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న…
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…