సిద్దిపేట కు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తాదట

KCR - Siddipet airportసిద్ధిపేట పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఈరోజు అక్కడి కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అలాగే పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ తరువాత నియోజకవర్గం పై వరాల జల్లు కురిపించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న సిద్దిపేటకు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్ నగరానికి నాలుగు దిక్కులా ఎయిర్ పోర్ట్ లు తీసుకొస్తామని గతంలో ఓసారి ప్రకటించారు. ఏళ్ళు గడుస్తున్నా ఆ ప్రతిపాదన ఏ మాత్రం ముందుకు సాగలేదు.

అలాగే వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. అది కూడా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రతిపాదన ఈ సారి ఏకంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించేశారు ముఖ్యమంత్రి.

సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర సమితి కంచుకోట. గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుండి కేసీఆర్ ఆరు పర్యాయాలు (నాలుగు సార్లు టీడీపీ టిక్కెట్ పై) గెలిచారు. ఆయన తరువాత హరీష్ రావు కూడా ఆరు సార్లు అక్కడ నుండి గెలిచారు. దీనితో కంచుకోట కు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తెస్తామంటున్నారు కేసీఆర్.

ADVERTISEMENT
Latest Stories