
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ వస్తున్నారు ఈడీ అధికారులు. అయితే మోడీ కోసమే ఈడీ పని చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా చట్టం తన పని తానూ చేసుకుని పోతుంది అనే డైలాగ్ తో బీజేపీ పెద్దలు ఈ సంఘటనల పై నోరు మెదపడం లేదు.
గత వారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇంట్లో సోదాలు అంటూ మొదలైన ఈడీ విచారణ కవిత అరెస్టు..ఆమె రిమాండ్ తో ముగించారు. అయితే తన సొంత కుమార్తె అరెస్టు విషయంలో అటు ఈడీ మీద కానీ ఇటు మోడీ మీద కానీ ఒక్కమాట మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పైన స్పందించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు…,ప్రతిపక్ష పార్టీలన్నింటిని నామరూపాలు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అంటూ కెజ్రీవాల్ అరెస్టుని ఖండించారు కేసీఆర్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టులతో ఈ ఘటనలకు బలం చేకూరింది అంటూ తొలిసారిగా కవిత అరెస్టు పై స్పందించారు కేసీఆర్.
ఒక మాజీ ముఖ్యమంత్రి గా, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నాయకుడిగా ఎదిగిన కేసీఆర్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు పై ఏనాడు స్పందించలేదు సరి కదా కనీసం హైద్రాబాద్ లో బాబు అభిమానులు ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా సహించలేదు.
‘తనవారు చేస్తే ధర్మం…తనవారికి జరిగితే అధర్మం’…అనుకుంటే ఎలా సారూ..! కవిత అరెస్టు అయ్యి వారం రోజులు గడిచిన కేంద్ర ప్రభుత్వం మీద నోరెత్తలేని కేసీఆర్…కేజ్రీవాల్ అరెస్టు జరిగిన 24 గంటలలో దాని పై తన స్పందన, ఖండన అంటూ గొంతెత్తడం రాజకీయంగా ఆయన ఉన్న దీన పరిస్థితికి అద్దం పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కుంటున్న సంక్షోభంలో తన కూతురు అరెస్టు అంటూ తానే ప్రచారం చేసుకుని పార్టీని, పార్టీ నేతలను ఇంకా కంగారు పెట్టడం ఎందుకని భావించారో ఏమో కానీ మౌనమే తన సమాధానం అన్నంటూ మిన్నకుండిపోయారు.
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…
An action sequence for Emraan Hashmi’s upcoming film Gunmaaster G9 reportedly took a scary turn…