
తెలంగాణలో ప్రస్తుతం అధికార – విపక్షాల మధ్య ఆస్తుల రాజకీయం రక్తి కడుతుంది. నిన్నటి దాకా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల చిట్టా పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రాజకీయం చేస్తే, దాన్ని కాస్త కొంతమంది ఆకతాయిలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్ల రూపంలో నడి రోడ్డు మీదకు తెచ్చారు.
కేసీఆర్ మొదలుకుని ఆయన మనవడు హిమాంషు వరకు కల్వకుంట్ల బ్రాండ్ పేరు మీద అధికారికంగా తెలంగాణలో ఉన్న భూముల చిట్టా పొద్దు మొత్తం బయటపెట్టారు సీఎం రేవంత్. గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వేళా కోట్ల విలువైన ఇన్ని వందల ఎకరాల భూమిని సంపాదించారని ఇదంతా అక్రమమని తేలితే ఒక్క గుంట భూమిని కూడా వదలబోమని, వాటిని పేద ప్రజలకు పంచిపెడతామంటూ రేవంత్ హామీ ఇచ్చారు.
అలాగే తన ప్రకటనలకు కట్టుబడి కేసీఆర్ భూముల పై విచారణ కమిటీ ఏర్పాటు చేసారు, వచ్చే 30 రోజులలో ఆ కమిటీ తనకు ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో అధికారుల పై కూడా చర్యలు తప్పవంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసారు.
ఇక కేసీఆర్ ఆస్తుల పై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు గాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కేసీఆర్ తనయుడిగా కేటీఆర్ రంగ ప్రవేశం చెయ్యడం కేసీఆర్ పుట్టుకతోనే శ్రీమంతుడు అంటూ వ్యాఖ్యానించడం, తమ కుటుంబానికి హైద్రాబాద్ లో కలిసి జీవించేందుకు సరైన సొంత ఇల్లు కూడా లేదని ప్రకటించడంతో కేటీఆర్ చేసిన రెండు భిన్న ప్రకటనల పై సోషల్ మీడియాలో ప్రశ్నలు, కౌంటర్లు మొదలయ్యాయి.
ఇలా కేసీఆర్ భూముల చిట్టా పొద్దుతో కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య మొదలైన ఆస్తుల రాజకీయంలో ఇప్పుడు బిఆర్ఎస్ వంతు అన్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు మంత్రి పొంగులేటి ఆస్తుల పై రచ్చ మొదలుపెట్టారు. పొంగులేటి ఆస్తుల పై ఈడీ విచారణ జరపాలంటూ రోడ్ల మీద నిరసనలకు దిగారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పై ఈడీ దాడులు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బిఆర్ఎస్ నేతలు హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీనితో ఇటు పోలీసులకు అటు బిఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగడం, బిఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ కి మంత్రి పొంగులేటి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంగణం మొత్తం రసాభాసగా మారిపోయింది.
కాంగ్రెస్ – బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందాల కారణమే పొంగులేటి ఆస్తుల పై ఈడీ మౌనం అంటూ బిఆర్ఎస్…కాంగ్రెస్, బీజేపీ లపై విమర్శలు షురూ చేసింది. ఇటు కాంగ్రెస్ సైతం కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ వంటి బిఆర్ఎస్ నేతల అవినీతి పై విచారణ జరిపేందుకు సిబిఐ ముందుకు రాలేకపోవడానికి కూడా బిఆర్ఎస్ – బీజేపీ ల మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందమే కారణంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది.
ఇలా ఈ రెండు పార్టీల మధ్య ఆయా పార్టీల నాయకుల ఆస్తుల పై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఏదిఏమైనా ఈ రచ్చతో రాజకీయ నాయకుల ఆస్తుల చిట్టా పొద్దు ప్రజలు ముందుకొస్తుంది.
The cockroach janta party was super successful in the earlier movement regarding the resignation of…
All five Women’s Premier League (WPL) franchises have announced their retained and released players ahead…