
తెలంగాణ ఉద్యమాలతో ఓ దశాబ్ధం, ముఖ్యమంత్రిగా మరో దశాబ్ధం పాటు రాష్ట్ర రాజకీయాలను శాశిస్తున్న కేసీఆర్‌ను ఎన్నికలలో ఓడించగల మగాడు లేడనే చెప్పొచ్చు. కానీ ఈసారి ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు!
పార్టీ వ్యూహంలో భాగంగానే అలా చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, మునుగోడు ఉపఎన్నికలలో కేసీఆర్‌కు కంగు తినిపించిన ఈటల రాజేందర్, ఈసారి గజ్వేల్‌లోనే ఆయనని ఓడించి ఇంటికి పంపిస్తానంటూ శపధం చేసినందునే, కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యగా కామారెడ్డిని ఎంచుకొన్నారని బీజేపీ వాదిస్తోంది.
ఈ పదేళ్ళలో కేసీఆర్ తాను ప్రతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. కనుక అక్కడ ఆయనను ఓడించడం చాలా కష్టమే. ఒకవేళ ఓడిస్తే, ఈటల రాజేందర్ మొనగాడని ఒప్పుకోకతప్పదు.
కామారెడ్డిలో కష్టమే:
కామారెడ్డిలో కూడా కేసీఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. ఓటుకి నోటు కేసు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నటికీ మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆ కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకి కూడా పంపించారు. కనుక కేసీఆర్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి, ఆయనను ఓడించేందుకు కామారెడ్డిలో సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్ధి కత్తిపల్లి వెంకట రమణారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు పట్టుంది. ఆర్ధికంగా బలంగా ఉన్నారు. చాలా కాలంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మంచి అనుబందం కలిగి ఉన్నారు. కనుక ఆయన బీజేపీని నమ్ముకోకుండా సొంతబలంతోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వలన నియోజకవర్గం ఏడు మండలాలలో రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారందరూ తమ భూములను కాపాడుకోవడానికి మాస్టర్ ప్లాన్ మార్చాలని చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కనుక వారందరూ బిఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంతగా అంటే ఎన్నికలలో నామినేషన్స్ వేసేటంతగా! కామారెడ్డిలో నామినేషన్స్ ఉపసంహరణ తర్వాత కూడా ఇంకా 39 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వారిలో రైతులు కూడా ఉన్నారు. అంటే కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్దం చేసుకోవచ్చు.
ఇవన్నీగాక ఈసారి తెలంగాణలో ‘కాంగ్రెస్ గాలి’ బలంగా వీస్తోంది. కనుక కేసీఆర్ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కామారెడ్డిలో గెలవలేకపోవచ్చు. ఒకవేళ గెలిచినా స్వల్ప ఓట్లతో గెలవవచ్చు.
బిఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నామని చెప్పుకొంటున్నారు కనుక ఒకవేళ గెలిస్తే ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు కానీ ఓడిపోతే వ్యూహం బెడిసికొట్టిన్నట్లవుతుంది కదా?
Story, Screenplay, Director: Aditya Haasan Cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya Music Director: Hesham Abdul Wahab…
BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…