మౌనంతో ఒకరు…దూకుడుతో మరొకరు..!

ఓటమి విచక్షణ, సహనాన్ని కోల్పోతుంది అని నిరూపిస్తున్నారు కేసీఆర్, జగన్. పదేళ్ల అధికారం చేజారడంతో విచక్షణ మరిచిన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని విలీనం అంచుల దాకా తీసుకెళ్లారు. అలాగే ఐదేళ్ల పదవి కూటమి సునామీతో కళ్ళ ముందు కొట్టుకుపోవడంతో సహనాన్ని కోల్పోయిన జగన్ వికృత ఆలోచనలకు తెరలేపి వైసీపీ పతనానికి మరోమెట్టు దిగారు.

ఓటమితో వచ్చిన నైరాశ్యంలో కేసీఆర్ కొన్నాళ్ళు రాజకీయ మౌనం పాటించారు. చివరికి కూతురు కవిత అరెస్టు విషయంలో కూడా కేసీఆర్ తన మౌనాన్ని వీడి పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపలేకపోయారు. దింతో కేసీఆర్ మౌనం తో బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది. కొన్ని దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ గెలుపుతో వచ్చిన పదవి కాంక్ష ఓటమి తో వచ్చే నిస్సహాయత ముందు తలవంచక తప్పలేదు.

ADVERTISEMENT

కేసీఆర్ మౌనం బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీస్తే జగన్ దూకుడు వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ కాబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు వారాల లోపే ప్రభుత్వం పై ఎదురుదాడి చేసి జగన్ నవ్వులపాలవుతున్నారు. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి బాబు సమీక్షలు, సమావేశాలు, వివరణలు అంటూ నిత్యం ప్రజలకు జవాబుదారిగా ఉంటూనే వస్తున్నారు.

అధికారంలోకి వచ్చిందే తడువుగా హామీలన్ని అమలు చేసి అద్భుతాలు చేసేయాలని వైసీపీ పట్టుబట్టడం సామాన్యుడు సైతం వ్యతిరేకిస్తున్న అంశం. 2019 వైసీపీ ఎన్నికల హామీలో ఇచ్చిన మద్యపాన నిషేధం గడిచిన ఐదేళ్లల్లో అమలు చేయలేని జగన్ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం ఏమాత్రం ధర్మబద్ధం అంటూ విశ్లేషకులు సైతం వాదిస్తున్నారు.

అక్కడ సొంత కూతురు అరెస్టు పై కూడా కేసీఆర్ మౌనం వహించారు. ఇక్కడ వీడియో పుటేజ్ ఆధారంగా తగిన సాక్ష్యాధారాలతో అరెస్టైన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వంటి వైసీపీ నేతల అరెస్టుల పై నిందితులకు మద్దతుగా స్పందిస్తూ తన పార్టీ పరువును తానే దిగజార్చుకుంటు ప్రజల ముందు పలుచనవుతున్నారు జగన్.

అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇక పార్టీని బీజేపీలోనే కాంగ్రెస్ లోనే విలీనం చెయ్యడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన మౌనానికి ముగింపు పలికి అసెంబ్లీ బాట పట్టారు కేసీఆర్. అసెంబ్లీకి జగన్ గైరుహాజరు పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల స్పందిస్తూ జగన్, అతని మిగతా 10 మంది ఎమ్మెల్యే లు వెంటనే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ వైసీపీ పై నిప్పులు చెరిగారు.

ఇలా మౌనం తో ఒకరు తన పార్టీని ముంచేస్తే, దూకుడుతో మరొకరు తన పార్టీని కొట్టుకుపోయేలా చేస్తున్నారు. ఇలా ఈ ఇద్దరి ఆలోచన వారి పార్టీని నమ్మిన వారికీ నష్టాన్ని కష్టాన్నే తెచ్చిపెడుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

39 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

42 minutes ago