కేసీఆర్ ‘కారు’కి ‘డ్రైవర్లు’ ఎక్కువయ్యరా.?

కేసీఆర్ ‘కారు’కి ‘డ్రైవర్లు’ ఎక్కువయ్యరా.?

తెరాస నుంచి బిఆర్ఎస్ గా మారిన తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రాంతీయవాదాన్ని వదిలి జాతీయవాదం వైపు అడుగులేసి తగిన మూల్యం చెల్లించుకుంది. అయితే గులాబీ సేన ఓటమితో అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా, ఫామ్ హౌస్ కి దగ్గరా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.

ADVERTISEMENT

దీనితో పార్టీ బరువును భుజాన వేసుకుని కేసీఆర్ కారుని సరైన మార్గంలో నడిపేందుకు ఆ డ్రైవర్ బాధ్యతను తీసుకునేందుకు కేసీఆర్ సొంత కుటుంబంలోనే పోటీ ఏర్పడిందన్న గుసగుసలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఇటు కేసీఆర్ రాజకీయ వారసుడుగా, పదేళ్లు మంత్రిగా చేసిన అనుభవంతో పార్టీ పై పట్టు సాధించాలని ఉర్రుతలూగుతున్న కేటీఆర్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపొట్టుకోవాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్, పార్టీ పెద్దగా బయటకు రాకపోయినప్పటికీ పార్టీ తరుపున అధికార పక్షం పై తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడు, కేసీఆర్ కారుకు సరైన డ్రైవర్, గులాబీ సైన్యానికి కాబోయే మహారాజు కేటీఆరే అనేలా పార్టీలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో కేటీఆర్ ఉన్నట్టు బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.

ఇక తెరాస పార్టీ ఆవిర్భావం నుండి బిఆర్ఎస్ పార్టీ ఆధునికీకరణ వరకు అటు కేసీఆర్ కు కుడి భుజంగా, పార్టీకి వెన్నుముకగా నిలిచిన కేసీఆర్ మేనల్లుడు, కేటీఆర్ బావ గారు హరీష్ రావు ఇప్పటికే పార్టీలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని తయారు చేసారని, కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను ప్రకటిస్తే, ఆ మరుక్షణమే హరీష్ రావు సొంత కుంపటి పెట్టేందుకు సిద్ధమని కొన్నేళ్లుగా బిఆర్ఎస్ ప్రత్యర్థి వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

కేవలం ఆ ఒక్క కారణంతోనే కేసీఆర్ ఇప్పటికి బిఆర్ఎస్ బాధ్యతలను అధికారికంగా కేటీఆర్ కు అప్పగించలేకపోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అయితే బిఆర్ఎస్ ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు గాని, పార్టీ క్యాడర్ కు గాని, పార్టీ లీడర్లకు కానీ అందుబాటులో ఉండడం లేదు.

అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం తనదే అన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇచ్చేందుకు హరీష్ దూకుడు రాజకీయాలతో ముందుకెళ్తున్నారు అనే చర్చ జరుగుతుంది.

దీనితో కేటీఆర్ తో పోలిస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావు, కేసీఆర్ కారుకి మెయిన్ డ్రైవర్ అవుతారా.? లేక అదనపు డ్రైవర్ గా మిగిలిపోతారా.? అన్న విషయం పై పార్టీ నేతలలో కూడా స్పష్టత లేకుండా పోయింది.

ఇక కేసీఆర్ కుమార్తెగా, కేసీఆర్ రాజకీయ వారసురాలిగా పార్టీలో తనకంటూ తగిన గుర్తింపు, గౌరవం కావాలంటూ కవిత కూడా తన ప్రయత్నాలు తానూ చేసుకుంటుందని, అందుకే ఈ మధ్యకాలంలో కవిత రాజకీయంగా చాల యాక్టీవ్ అయ్యారనే టాక్ నడుస్తుంది.

ఇప్పటికే కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం, బిఆర్ఎస్ కారు డ్రైవర్ సీటు కోసం కేసీఆర్ తరువాత స్థానం పై కేటీఆర్, హరీష్ రావు కర్చీఫ్ వేయడంతో ఇక కవిత కు ఆ సీటు దక్కే అవకాశం ఉందా.? అంటే దానికి సమాధానం కవితకు కూడా తెలుసన్నది వాస్తవం.

అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏ అవకాశం ఎటువైపు నుండి వచ్చి అందలం ఎక్కిస్తుందో ఎవరు ఊహించలేరు కాబట్టి ఎవరి ఆశలు వారివి, ఎవరి రాజకీయం వారిదే. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ కారులో మోతాదుకు మించిన నాయకులు ఉంటూ గులాబీ కారు ఎప్పుడు ఓవర్ లోడ్ లో ఉండేది.

ఇప్పుడు అదే కారుకి అవసరానికి మించిన డ్రైవర్లు రావడంతో కేసీఆర్ తన గులాబీ కారు స్టీరింగ్ ను ఎవరి చేతిలో పెట్టబోతున్నారు అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంత వాస్తవం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

7 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

37 minutes ago