
కీరవాణి అంత అభిమానం చూపించడానికి బలమైన కారణం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు మొదటి అవకాశం ఇచ్చింది రామోజీరావే. నరేష్ హీరోగా నటించిన మనసు మమతతో ఇది సాధ్యమయ్యింది. నిజానికా టైంలో ఉషాకిరణ్ మూవీస్ లో ఛాన్స్ రావడమంటే అదో పెద్ద సవాల్ లా ఉండేది. కథతో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ప్రతిదీ చాలా ప్రణాళికబద్ధంగా రాజీలేని ధోరణిలో ఉంటుంది. అలాంటిది ఆ బ్యానర్ లో వరసగా తేజ, అమ్మ, పీపుల్స్ ఎన్ కౌంటర్ ఆల్బమ్స్ చేయడం చిన్న విషయం కాదు. వాటి దర్శకుల ప్రమేయం కన్నా రామోజీ బృందం తీసుకునే నిర్ణయాల వల్లే కీరవాణికి ఇవన్నీ దక్కాయన్నది కాదనలేని వాస్తవం.
అందుకే అంతపెద్ద వేదిక మీద ప్రత్యేకంగా ప్రస్తావించారు తప్పించి అదేదో రామోజీరావే ఆస్కార్ సభ్యులకు చెప్పి ఇప్పించలేదు. గురువుల మీద కెరీర్ కి తొలినాళ్ళలో తోడ్పాటునందించిన పెద్దల మీద ఎవరికైనా ఆ భావం ఉండాల్సిందే. ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కోదండపాణి పేరు మీద స్టూడియోతో పాటు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. తనది కానీ పిల్లలది కానీ కాదు. ఎందుకంటే సమాధానం తెలిసిందే. జంధ్యాల చనిపోయినప్పుడు బిడ్డల కన్నా ఎక్కువ తల్లడిల్లిపోయింది నరేష్. అప్పటి అంతిమయాత్ర దృశ్యాలు గుర్తున్నవాళ్ళకు ఇది బాగా తెలుసు. చంద్రబోస్ ఇండియా రాగానే రామానాయుడు స్టూడియోస్ ఎందుకు వెళ్లారో వేరే చెప్పాలా
ఇలా వందల్లో ఉదాహరణలు ఉన్నాయి. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటే ప్రతి అడుగులో వెనుక ఉండేవాడే కానక్కర్లేదు. మొదట తోడ్పాటు అందించినవారే కావొచ్చు. ఒక బిల్డింగ్ వంద సంవత్సరాల తర్వాత కూలిపోలేదంటే దాని గొప్పదనం ముందు కట్టిన మేస్త్రికి దక్కుతుంది. కీరవాణి అంతగా రామోజీరావుగారికి గౌరవం ఇస్తారంటే ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. కాకపోతే ఎన్నో అవార్డులు అందుకున్నా జీవిత కాల లక్ష్యమైన ఆస్కార్ వరించాక మరోసారి తన గురుభక్తిని అందరికీ చెప్పాలనుకున్నారు తప్పించి అంతకు మించి ఏం లేదు. ఆ మాత్రం దానికి సంబంధం లేని రాజకీయాలకు దీన్ని ముడిపెట్టి కీరవాణికి ఆపాదించడం ఎంతవరకు న్యాయం
కరోనా వైరస్ చైనాలో పుట్టి యావత్ ప్రపంచ దేశాలకు వ్యాపించి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. అదేవిధంగా,…
Harshit Rana has been ruled out of India’s upcoming T20I series against Afghanistan and the…