పెళ్ళికి తొందరపడుతున్నాడట… హీరోయిన్ ‘రివీల్’ చేసింది..!

Keshava Isha Koppikar - Nikhil Commentsవరుస విజయాలతో దూసుకువెళ్తున్న యువ హీరో నిఖిల్, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “కేశవ” రూపంలో సందడి చేస్తున్నాడు. ఫస్ట్ డే గ్రాండ్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషాకొపికర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

“మీకు పెళ్ళయ్యింది, ఒక బేబీ ఉంది, నాక్కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది తనతో చెప్పగా…” వద్దు వద్దు… కంగారుపడకు… అప్పుడే పెళ్లి చేసుకోకు… జీవితాన్ని అనుభవించు… పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పటికి తప్పక అవుతుంది… అని చెప్పానని నిఖిల్ పెళ్లి సీక్రెట్ గురించి ఇషాకొపికర్ బయటపెట్టింది. నిఖిల్ ని ఇష్టపడే వారికి కాస్త చేదు వార్తే అయినప్పటికీ, పెళ్లి చేసుకోవాలని బాగా ఊబలాటపడుతున్నాడని ఇషా తెలిపింది.

ADVERTISEMENT

ఇక, తనకు తెలుగు హీరోలకు వచ్చే సరికి, ప్రభాస్ అంటే ఇష్టమని, ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా నటించిన పాత్రలు తనకు బాగా నచ్చాయని, నిజానికి ఆ పాత్రలు ఎవరు పోషించినా తనకు నచ్చేవారని, రాజమౌళి అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కించారని… టాలీవుడ్ లో అభిమాన హీరో పేరు అడిగితే, పరోక్షంగా అభిమాన దర్శకుడెవరో కూడా వివరించింది ఇషా. నిజానికి ‘బాహుబలి 2’ చూసిన తర్వాత అందరి నుండి ఇదే జవాబు వస్తుందిలేండి!

ADVERTISEMENT
Latest Stories