
కేశినేని ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్ లో ఎక్కువగా వినపడే పేరు. టీడీపీ పార్టీ తరుపున రాజకీయంగా ఎదిగిన కేశినేని నాని విజయవాడలో తనకంటూ ఒక పొలిటికల్ బ్రాండ్ తెచ్చుకున్నారు.
టీడీపీ పార్టీ ఎంపీ గా ఉంటూ రాజకీయంగా బాగా బలపడిన కేశినేని నాని, పార్టీ కంటే కూడా తనకే ప్రజా బలమెక్కువ, అధినేత కంటే తన పైనే బెజవాడ వాసులకు మక్కువెక్కువ అనే భావనతో, అన్నదమ్ముల మధ్య ఉన్న కుటుంబ కలహాలతో 2024 ఎన్నికల ముందు టీడీపీ కి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు.
అయితే తన అన్న వదులుకున్న అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న చిన్ని అత్యంత కీలకమైన విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుని తన అన్న నాని పైనే విజయం సాధించి నాని అహం మీద కొట్టారు. దీనితో వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు గుమ్మడికాయ కొట్టిన నాని ఇప్పుడు తన తమ్ముడు చిన్ని మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం విశాఖలో సుమారు 60 ఎకరాల భూమి ని ఉర్సా కంపెనీ కి కేటాయించడంతో మొదలైన వీరి రాజకీయ రచ్చ ఇప్పుడు రూపం మార్చుకుని ఏపీ లిక్కర్ స్కాం వరకు పాకింది. తాజాగా విజయవాడ మాజీ ఎంపీ నాని ప్రస్తుత ఎంపీ చిన్ని మీద మరికొన్ని రాజకీయ విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
లిక్కర్ స్కాం కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ప్రభుత్వం విచారించాలని, ఈ కేసులో కీలక నిందుతుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీలలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందని, చిన్ని కంపెనీలలో రాజ్ కసిరెడ్డి కూడా ఒక భాగస్వామని, వీరు మనీ లాండరింగ్ ద్వారా నిధుల్ని విదేశాలకు మళ్ళించారంటూ కేశినేని నాని, తన తమ్ముడు చిన్ని పై ఆరోపణలు గుప్పించారు.
అయితే నాని తన పైన చేసిన ఆరోపణలకు గాను చిన్ని క్లారిఫికేషన్లు ఇస్తున్నారు. దమ్ముంటే తనకు కసి రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నిరూపించాలని, ఇష్టాను రీతిగా నాని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారంటూ కసిరెడ్డి కి తనకు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు చిన్ని.
తాను రాజకీయాలకు రాకమునుపు తన సంస్థకు చెందిన స్థలం సరిహద్దులో కసిరెడ్డి కి కూడా స్థలం ఉండేదని, ఆ కారణంగా ఇద్దరు కలిపి సంయుక్తంగా నిర్మాణాలు చెప్పట్టాల్సి వచ్చిందని, అయితే తానూ రాజకీయాలలోకి రావడంతోనే ఆ వ్యవహార లావాదేవీలన్నిటికి అక్కడితో ముగింపు పలకడం జరిగిందంటూ క్లారిటీ ఇచ్చారు చిన్ని. ప్రస్తుతం తనకు కసిరెడ్డి సంస్థతో ఎటువంటి సంబంధాలు లేవంటి తేల్చి చెప్పారు టీడీపీ ఎంపీ చిన్ని.
అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు కావడంతో, వీరి మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలతో నాని, చిన్ని ల మధ్య ఈ కుటుంబ ఆస్తి విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్ని ఒకకరికొకరికి క్షుణ్ణంగా తెలియడం, వాటిని అదునుగా చేసుకుని ఇలా రాజకీయ కక్ష్య సాధించడంతో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన ఈ రాజకీయ వార్ ఒక సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంటుందన్న స్ఫష్టత టీడీపీ పార్టీ శ్రేణులకు కూడా వచ్చేసింది.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…