ఫస్ట్ ‘క్వార్టర్’ మెగాస్టార్ దే!

Khaidi No 150 Collections Tollywood News2017వ సంవత్సరం సినీ పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఏ సినిమా కూడా దారుణ పరాజయాన్ని చవిచూడకపోవడంతో, టాలీవుడ్ వర్గీయులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా ఒక్కటే కాస్త ఎక్కువ నష్టాలను మిగల్చగా, పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. అయితే వీటన్నింటి కంటే మిన్నగా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు తమ హవాను కొనసాగించడం చెప్పుకోదగ్గ పరిణామం.

‘గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజి’ వంటి చారిత్రాత్మక ప్రయోగ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కళకళలాడడంతో కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆహ్వానిస్తున్నారనే విషయం సినీ పెద్దలకు కూడా అవగతమైంది. అలాగే ‘శతమానం భవతి, నేను లోకల్’ వంటి వర్ధమాన హీరోల సినిమాలు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంతో, ఇండస్ట్రీ మునుపెన్నడూ చూడని రెవిన్యూను చవిచూసింది. అలాగే ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, విన్నర్’ వంటి సినిమాలు కూడా మంచి వసూళ్ళనే రాబట్టాయి.

ADVERTISEMENT

అయితే ఫస్ట్ క్వార్టర్ మొత్తమ్మీద అగ్ర స్థానం మాత్రం మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్, ఇప్పటితరం స్టార్ హీరోలైన మహేష్, పవన్ స్టామినాలతో పాటుగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడం, చిరు రేంజ్ ని చాటిచెప్పింది. ‘నాన్ బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టిందని చెప్తోన్న ఈ సినిమా కలెక్షన్లపై కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ‘పంచారిష్ట’తో ఫుల్ పటాస్ చేసిన మెగాస్టార్ దే 2017 ఫస్ట్ ‘క్వార్టర్’ అని మాత్రం పక్కాగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories