ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ సంక్రాంతికి సందడి చేసిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా పదేళ్ళ తర్వాత వెండితెరపై మెగాస్టార్ ను చూసుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. దీంతో ఒకటికి రెండు సార్లు చిరును చూసుకుని సంబరపడిపోయారు.
తాజాగా మెగా అభిమానుల కోసం ‘ఖైదీ నంబర్ 150’లో ఎడిటింగ్ చేయబడ్డ కొన్ని సీన్లను యూ ట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా చిరంజీవి – కాజల్ మధ్య వచ్చే ఓ సన్నివేశం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. కాజల్ కు లైనేస్తూ సిగ్గుపడిపోతున్న చిరంజీవిని చూస్తూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇలాంటి సన్నివేశాలను పండించడంలో దిట్ట అయిన మెగాస్టార్ ను చూస్తూ… ఈ 29 సెకన్ల సీన్ ను సినిమాలో ఎందుకు తొలగించారు అంటున్నారు అభిమానులు.



