Telugu

కవిత టిఆర్ఎస్ కన్నా టి. బీజేపీ వెనకంజలో ఉందా.?

తెలంగాణ రాజకీయాలలో బీజేపీ స్థానం, స్థాయి ఏమిటి అన్నది కనీస ఆ పార్టీ నాయకులకు కూడా అర్ధం కానీ ఒక చిక్కు ప్రశ్నే. ఒక్కో సందర్భంలో తెలంగాణ లో ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం తామే అంటూ బిఆర్ఎస్ స్థానం భర్తీ కోసం అడుగులేస్తారు.

మరో సందర్భంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు మూడో ప్రత్యామ్నాయం తామే అంటూ పోరాటాలకు సై అంటారు. మరికొన్ని సందర్భాలలో అసలు తెలంగాణ రాజకీయాలలో బీజేపీ ఉనికి ఉందా, లేదా అన్నట్టుగా సైలెంట్ అయిపోతారు. ప్రస్తుతం టి. బీజేపీ ఇటువంటి సైలెంట్ జోన్ లో కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఒక పక్క ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఆ నియోజకవర్గంలో ఉపఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఒకపక్క కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న మూడో ఉపఎన్నికను కూడా తమ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహపడుతుంటే,

మరో పక్క ఈ ఉపఎన్నికలలో గెలుపు జెండా ఎగరేసి రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపు తధ్యమని పార్టీ క్యాడర్ కి నిరూపించేందుకు వారిలో తిరిగి జోష్ తెచ్చేందుకు బిఆర్ఎస్ ప్రణాళికలు వేస్తుంటే,

ఇక నిన్న కాక మొన్న టిఆర్ఎస్ తో తెలంగాణ రాజకీయలలో కొత్త ప్రయాణం మొదలు పెట్టిన కవిత సైతం ఖైరతాబాద్ ఉపఎన్నికలలో మేము సైతం అంటూ అటు అధికార కాంగ్రెస్ ను కవ్విస్తూ, ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ ను రెచ్చకొడుతూ ప్రకటనలు చేస్తుంటే,

మరి జాతీయ పార్టీగా, కేంద్రంగా హ్యాట్రిక్ విజయం సొంత చేసుకున్న రాజకీయ పార్టీగా, తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు దశాబ్దాలుగా కలలు కంటున్నా టి. బీజేపీ మాత్రం ఇప్పటికి ఖైరతాబాద్ ఉపఎన్నికల అంశం పై సైలెంట్ గానే ఉంటుంది.

బీజేపీ మౌనం కూడా ఒక రాజకీయ వ్యూహమేనా.? అధికార, విపక్షాల పోటాపోటీ ప్రకటనలు, వారి బలాలు – బలహీనతలు అన్ని బయటకు వచ్చాకా దాని తగ్గ విధంగా బరిలోకి దిగేందుకు టి. బీజేపీ వేచి చూస్తుందా.? అయితే బీజేపీ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ ఖైరతాబాద్ ఉపఎన్నికలలో జోరు పెంచి పార్టీ స్థాయిని, స్థానాన్ని మెరుగుపరుచుకోగలిగితే ‘మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే’ అన్న మోడీ ప్రకటనకు బలం చేకూర్చినట్టు అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hero’s Girlfriend Hits Back: His Wife Tried to Kill Him

The controversy around Govinda's alleged affair with Komal Rani Swarnkar is refusing to die down.…

16 minutes ago

YSRCP Poison Started On Amaravati Again?

Very rarely do we see a capital area or an entire region being specifically targeted…

46 minutes ago