Telugu

ఉపఎన్నికలు కవిత బరిలోకి దిగుతారా.?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం పై హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఖైరతాబాద్ లో ఉపఎన్నికలు దాదాపు ఖరారయినట్టే కనిపిస్తుంది. దీనితో అధికార – ప్రతిపక్షాలు తమ తమ రాజకీయ బలం తెలుసుకునేందుకు తమ ప్రత్యర్థులకు తెలియచెప్పేందుకు ఈ ఉపఎన్నికలను ఒక అవకాశంగా చూస్తున్నాయి.

ఉపఎన్నికలు అంటే సాధారణంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉంటుంది. దాన్నే తమ బలంగా భావిస్తుంది అధికార పార్టీ. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లే గడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతుంది.

ADVERTISEMENT

అందునా దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ప్రజా తీర్పుని గౌరవించని ఇటువంటి నాయకుల మీద ప్రజలలో అసంతృప్తి కనిపిస్తుంది. అయితే ఈ ప్రజల అసంతృప్తిని, ఆ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునేందు బిఆర్ఎస్ సర్వ వక్తులు వడ్డుతుంది.

అలాగే ప్రభుత్వం పై రాజకీయంగా పై చేయి సాధించేందుకు వచ్చిన అవకాశాన్ని బిఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చునేందుకు తండ్రి కేసీఆర్ తో అయినా సీఎం రేవంత్ తో అయినా, కేంద్రంలో మోడీ తో ఆయినా రాజకీయ యుద్దానికి తానూ సిద్ధమంటూ ప్రకటించిన కవిత ఈ ఉపఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే సాహసం చేస్తారా.?

గత పదేళ్ల కేసీఆర్ పాలన మీద ఆరోపణలు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయం తానూ, తన పార్టీనే అంటూ బలమైన రాజకీయ ప్రకటనలు చేస్తున్న కవిత అసలు తెలంగాణ క్షేత్ర స్థాయి రాజకీయాలలో తన టిఆర్ఎస్ బలమెంతో, ప్రభావం ఏంటో తానూ తెలుసుకునేందుకు, తన రాజకీయ ప్రత్యర్థులకు తెలియచేసేందుకు ఖైరతాబాద్ ఉపఎన్నికలు ఒక అవకాశంగా తీసుకుంటారా.?

తానూ కానీ తన పార్టీ నుంచి కానీ ఎవరైనా బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, బిఆర్ఎస్ పార్టీ ని తలదన్నేట్టుగా, బీజేపీ ని ఎదిరించేలా బరిలోకి దింపనున్నారా.? ఈ ఉపఎన్నికలతో కవిత తెరాస సత్తా చాటగలిగితే కవిత చేస్తున్న ప్రకటనలకు మరింత బలం చేకూరినట్టు అవుతుంది. లేకుంటే కవిత రాజకీయం కూడా షర్మిల రాజకీయం మాదిరే చివరికి ఆడ ఈడ అంటూ సర్దుకోవాల్సి వస్తుందేమో బహుశా…!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kanchana 4 Slowly Becoming Huge Headache for Lawrence?

After the critically acclaimed success of Jigarthanda DoubleX, Raghava Lawrence started shooting for the fourth…

29 minutes ago

New Cockroach Fight: EC Chief Must Resign In 2 Days!

The cockroach janta party movement created history at the Jantar Mantra earlier by constituting the…

58 minutes ago