Telugu

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుతుందని ఆ రోజు ఎవరూ ఊహించలేదు.

అమెరికాలోని రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసిన కిలారు రాజేశ్ ముందు అవకాశాలెన్నో ఉన్నాయి. కానీ బాల్య మిత్రుడు నారా లోకేశ్ పిలుపుతో వాటన్నిటినీ వదులుకొని వచ్చేశారు.

ADVERTISEMENT

మిత్రుడుకి అత్యంత కష్టకాలంలో నిశ్శబ్దంగా వచ్చి పక్కన నిలబడ్డారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు పదవి, అధికారం అంటే చుట్టూ చేరేవారు చాలా మందే ఉంటారు. కానీ నీ కష్టకాలంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి అండగా నిలబడేవారే అరుదు. అలాంటి అరుదైన వ్యక్తే కిలారు రాజేశ్.

యువగళం.. ఓ భవిష్యత్‌ రణవ్యూహం.. ఆ వ్యూహ రచన చేసిన రాజేశ్‌ పేరు పెద్దగా వినపడలేదు. ఆయన కోరుకోలేదు కూడా.

ఏకధాటిగా నెలల తరబడి 3,132 కిమీ నడక… ఆ పయనంలో లక్షలాది మంది జనంతో నారా లోకేష్‌ మమేకం అవుతూ సాగుతుంటే ఆయన వెంటే.. మీడియాకు చాలా దూరంగా రాజేశ్ కూడా సాగారు.. ఎక్కడికక్కడ అన్నీ ప్లాన్ చేస్తూ.

యువగళంలో రోజుకో సవాలు, సమస్య.. ప్రతీదానికి రాజేశ్ వద్ద ప్లాన్-బీ సిద్ధం. చకచకా జరిగిపోతున్న ఆ ఏర్పాట్లు చూస్తున్న టీడీపి నేతలే ఇది పాదయాత్ర లేక మిలిటరీ ఆపరేషనా ఇంత పకడ్బందీగా ఉన్నాయి అని అనుకోకుండా ఉండలేకపోయారు.

ఆ తర్వాత మళ్ళీ మిత్రుడుకి మరో పెద్ద కష్టం. జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చంద్రబాబు నాయుడు ఇలాంటి సవాళ్ళను తట్టుకోగలరు. కానీ ఏమాత్రం ఆలస్యం చేసినా పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుంది. మళ్ళీ ప్లాన్-బీ సిద్దం. అది ఏవిధంగా సాగిందో అందరూ చూశారు.

తర్వాత మరో మహాసంగ్రామం .. దాని కోసం టీడీపీ, జనసేనల పొత్తుప్రకటన బాగానే ఉంది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది.

రెండు పార్టీలలో అనుమానాలు, అపోహలు, అభ్యంతరాలు, సమస్యలు, బయట నుంచి సవాళ్ళు.. అంతా కత్తిమీద సామే. ఏ చిన్న తేడా వచ్చినా కూటమి ఇక కోలుకోవడం కష్టం.

కానీ రాజేశ్ దౌత్యవేత్తగా మారి ప్రతీ సమస్యని ఒకటొకటిగా పరిష్కరిస్తూ మార్గం సుగమం చేశారు. ఫలితం? ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని తిరుగులేని విజయం.

ఈ రోజుకీ ఏ టీవీ డిబేట్‌లోనూ రాజేశ్ కనిపించరు. ఆయన పేరు వినిపించదు. ఈ పవర్ కారిడార్లలో అత్యంత కీలకమైన మనిషి అయినా, నంబర్ 2గా గుర్తింపు పొందాలని ఆరాట పడలేదు. అధికారం వెనుకున్న బాధ్యతనే చూశారు. మిత్రుడి కోసం తెర వెనుక శ్రమిస్తూనే ఉన్నారు.

సాయం కోరి వచ్చిన ప్రతి నిజాయితీపరుడికీ అండగా నిలిచే మంచి మనసు. స్నేహానికి ప్రాణమిచ్చే విశ్వసనీయత. ఈ రెండే పార్టీ శ్రేణులు కూడా ఆయనకు మరింత చేరువయ్యేలా చేశాయి.

మిత్రుడు కోసం, టీడీపి కోసం, కూటమి ఐక్యత కోసం మీరు చేసిన ఈ మహా యజ్ఞంతోనే నేడు ఆంధ్రప్రదేశ్‌ ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు.

“అధినేత నమ్మకమే నా ఊపిరి.. పార్టీ విజయమే నా గమ్యం!” అన్నట్లుగా తన జీవనవిధానాన్ని మార్చుకున్న మనిషి కిలారు రాజేశ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

2 minutes ago

C. Kalyan in Trouble Again? Complaint Filed in Madhapur

Tollywood producer C. Kalyan is facing a fresh land encroachment complaint at the Madhapur police…

17 minutes ago