
ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, “నువ్వు (జగన్) ఈ నాలుగేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళావు? అక్కడకు వెళ్ళి వారితో ఏం మాట్లాడుతున్నావు?కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా సహకరిస్తోందని నువ్వే కదా పొగిడావు కదా?మరిప్పుడు బిజెపి అండగా నిలబడలేదని ఎలా అంటున్నావు?
వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-8 నిందితుడుగా ఉన్న మీ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు నువ్వు ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పుతున్నావు కదా?వివేకాను ఎవరు, ఎందుకు హత్య చేశారో లోకంలో అందరికీ తెలుసు. కానీ ఇంతవరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతోంది. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్ళినా, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే వంకతో అరెస్ట్ చేయకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు? బిజెపి అండదండలు లేకపోతే సీబీఐని అడ్డుకోగలవా?
నువ్వు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డావని ఆరోపిస్తూ సీబీఐ నీమీద 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. సుమారు రూ.40 వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. అయినా సీబీఐ కోర్టులో నాలుగేళ్ళుగా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదు. ఆ కేసుల విచారణకు నువ్వు ఏనాడూ హాజరుకాలేదు. బిజెపి అండ లేకుండా ఇవన్నీ సాధ్యమా?
దేశంలో మరే రాష్ట్రానికి లభించనంత అప్పులు ఏపీకి లభిస్తున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి మరీ అప్పులు లభిస్తుండటం చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. బిజెపి అండ లేకుంటే నీ ప్రభుత్వానికి ఇన్ని అప్పులు పుట్టేవా?
ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో రెవెన్యూలోటు భర్తీ కింద ఏపీకి రావలసిన బకాయిల కోసం మేము నాలుగేళ్ళపాటు ఢిల్లీ పెద్దల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాము. కానీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నువ్వు అడగగనే కేంద్రం రూ.10,460 కోట్లు విడుదలచేసింది. బిజెపి (కేంద్ర ప్రభుత్వం) సహకరించకపోతే ఈ నిధులు విడుదలవుతయా?” అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…