
2024 ఎన్నికల ఫలితాలలో చాలామంది సామాన్య ప్రజానీకం ఆసక్తిగా గమనించిన ఒక నియోజకవర్గం గుడివాడ. గుడివాడ కేంద్రంగా గత కొన్నేళ్లుగా కొడాలి నాని చేస్తున్న బూతు రాజకీయానికి ఇప్పటికైనా ఇక్కడి ప్రజలు స్వస్తి చెపుతారా.? లేక మరోసారి ఈ విష సంస్కృతిని ప్రోత్సహిస్తారా.? అంటూ కొన్ని లక్షల కళ్ళు గుడివాడ నియోజకవర్గ ఫలితం కోసం ఎదురుచూశాయి.
అయితే ఆ ఫలితం వైసీపీ కి షాక్ తో పాటు కొడాలి నానికి హార్ట్ స్ట్రోక్ కూడా తెచ్చింది. దీనితో గత ఏడాదిన్నర్ర గా కొడాలి రెస్ట్ మోడ్ లోకి, వైసీపీ శ్రేణులు సైలెంట్ మోడ్ లోకి, అలాగే టీడీపీ క్యాడర్ ఫ్రస్టేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కొడాలి నాని పై చర్యలెక్కడా.? ఆయన పై కూటమి ఉదాసీనతకు కారణమేమిటి.? అంటూ అమరావతి నుంచి అమెరికా వరకు టీడీపీ అధిష్టానానికి ప్రశ్నల వర్షం కురుస్తుంది.
అయితే దేనికైనా ఒక సమయం, సందర్భం రావాలని, చట్టం తన పని తానూ చేసుకుపోవాలంటున్నారు టీడీపీ అధినాయకత్వం. టీడీపీ శ్రేణుల వర్షన్ ఇలా ఉంటే ఇక వైసీపీ వాళ్ళ ఆలోచన మారోలా ఉంది. గత ఐదేళ్లు టీడీపీ పార్టీని, చంద్రబాబు కుటుంబాన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్చర్ చేసిన హీరోగా వైసీపీ లో కొడాలి బూతు రాజకీయానికి ఒక వర్గం మద్దతు ఉంది.
అటువంటి వారందరు కొడాలి ఎక్కడ దాక్కున్నాడు.? అధికారం లేకపోతే ప్రభుత్వం తో పోరాడలేరా.? బాబు ని ఎదుర్కోలేరా.? కొడాలి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలి, బాబుతో యుద్ధం చేయాలి, టీడీపీ కి సవాల్ విసరాలి అంటూ నాని కం బ్యాక్ కోసం వేయికళ్లతో ఎదురు చుస్తున్నారు.
అయితే అటువంటి వారికి నాని కం బ్యాక్ ప్రకటన ఉత్సాహాన్ని ఇచ్చినా అది టీడీపీ కి మాత్రం పరమానందాన్ని కలిగిస్తుంది. కొడాలి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండి తిరిగి ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొని కూటమి ప్రభుత్వం పై పోరాటానికి సిద్డమయితే టీడీపీకి అవసరమైన సమయం, కూటమి కావాల్సిన సందర్భం రెండు వాటంతట అవే ఎదురొస్తాయి.
తద్వారా కొడాలి మీద ఉన్న పాత కేసులు, ఆయన అనారోగ్యం ఫలితంగా అటకెక్కిన అవినీతి చిట్టా పొద్దుళ్ళు ఒక్కొక్కొటిగా కిందకు దిగుతాయి. ఇక ఆ తరువాత చట్టం తన పని తానూ చేసుకుంటూ పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొడాలి కం బ్యాక్ అనేది వైసీపీ కి ఎంత ఆనందాన్ని ఇస్తుందో టీడీపీ కి అంతకు పదింతల సంతోషాన్ని అందిస్తుంది.
అయితే ఇక్కడ వైసీపీ ఆనందానికి, టీడీపీ సంతోషానికి మూల్యం మాత్రం కొడాలి తప్పక చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ రకమైన బూతు రాజకీయం అనే విష సంస్కృతీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చెద పురుగు మాదిరి పట్టి పీడిస్తుంది.
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…