Telugu

కొడాలి నానికి అప్పుడే గుండెల్లో దడ!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతగా రెచ్చిపోయారో అందరూ చూశారు. కనుక ఎన్నికలలో వైసీపీ ఓడిపోగానే రెడ్‌బుక్‌ ప్రకారం ముందుగా ఆయనతోనే కేసుల ఎపిసోడ్స్ మొదలవుతాయని అందరూ అనుకున్నారు. ఆయన కూడా అదే అనుకున్నారు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వానికి జగన్‌ కనీసం ఆరు నెలలు సమయం ఇవ్వకుండానే విమర్శలు, ఆరోపణలు, ధర్నాలు, దీక్షలు మొదలుపెట్టేశారు. కానీ కూటమి ప్రభుత్వం కొడాలి నానికి 7-8 నెలల సమయం ఇచ్చింది. కానీ అది తనకు ‘బఫర్ టైమ్’ మాత్రమే అని ఆయన బాగానే గ్రహించారు.

కనుక ఈ 9 నెలల్లో పార్టీ కార్యక్రమాలలో, రాజకీయాలలో పెద్దగా హడావుడి చేయలేదు. ఒకటి రెండుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మొక్కుబడిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి సైలంట్ అయిపోయారు. అది బఫర్ టైమ్ పెంచుకునేందుకే ఉపయోగపడుతుంది తప్ప కేసుల నుంచి విముక్తి కల్పించదని ఆయనకీ బాగా తెలుసు. ఆయన భయపడుతున్నట్లే కేసులు మొదలయ్యాయి. కొంతమంది అనుచరులు ఇప్పటికే లోపలకు వెళ్ళారు.

కనుక తనకీ డేట్ దగ్గర పడుతోందని కొడాలి నానికి మనసులో ఆందోళన మొదలైందో ఏమో ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్లో చేరారు. వైద్యులు మొదట గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నా అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండెలో సమస్య ఉందని గుర్తించి చికిత్స ప్రారంభించారు.

కొడాలి నానికి కేసుల బెడద ఎలాగూ తప్పదు. వాటి కారణంగా ఆందోళన చెందినందుకు గుండె పోటు కూడా తెచ్చుకున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే…

14 minutes ago

నా కుట్రలు ఫలించాయి కూటమి విచ్చినం అయ్యింది!

జీవిత చరిత్రలు వ్రాసుకునే ప్రముఖులు తమ గొప్పలు చెప్పుకోవడానికే ఇష్టపడతారు తప్ప చేసిన తప్పులు, అసమర్ధత గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.…

42 minutes ago