
మాజీ మంత్రి కొడాలి నానికి విశాఖ పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని, అయన సతీమణి భువనేశ్వరిని, వారి కుమారుడు నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి చాలా అవహేళనగా, అనుచితంగా మాట్లాడేవారు.
కనుక ఓ మహిళగా కొడాలి నాని మాటలను భరించలేకపోయానంటూ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్దిని అంజన ప్రియ గత ఏడాది విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఆమె పిర్యాదు మేరకు సీఐ రమణయ్య వివిధ సెక్షన్స్ కింద కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కానీ ఆయన గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నందున ఇంతకాలం విచారణకు పిలవలేదు. ఇప్పుడు అయన మళ్ళీ వైసీపీ నాయకులతో కులాసాగా తిరుగుతున్నారు కనుక విశాఖ త్రీటౌన్ పోలీసులు కృష్ణాజిల్లాలోని గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్ళి విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ అందించి వచ్చారు.
కొడాలి నాని మంత్రిగా పని చేశారని అందరికీ తెలుసు కానీ ఏ శాఖకి మంత్రి అని అడిగితే చాలా మంది సమాధానం చెప్పలేరు. కానీ ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడుతుండే వారు కనుక బూతుల మంత్రిగా ప్రజలు ఆయనని బాగా గుర్తుపెట్టుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్ట మొదట ఆయనతోనే బ్యాటింగ్ మొదలు పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అయన టోకెన్ రావడానికే 13 నెలలు పట్టింది. అదీ…. గుడివాడ నుంచి కాక విశాఖ నుంచి రావడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. విశాఖ నుంచి ఈ పిలుపు బహుశః వ్యూహాత్మకమే కావచ్చు.
కానీ కొడాలి నాని వంటి ఘన చరిత్ర కలిగిన నాయకుడుకి ఈ పిలుపు ఏ మాత్రం సరిపోదనిపిస్తుంది. ఆయనకి పిలుపు అంటే ఎంత గొప్పగా ఉండాలి? చాలా చప్పగా ఉంది. మూడో కంటికి తెలియకుండా విచారణ జరిగిపోవాలన్నట్లుంది. ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని ఎపిసోడ్స్ విశాఖ నుంచి మొదలవబోతున్నాయని స్పష్టం అయ్యింది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…