
వైసీపీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏడాదిన్నర సుదీర్ఘ రాజకీయ విరామం ముగించుకుని ఎట్టకేలకు రాజకీయ తెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ కాపు టైగర్ అంబటి రాంబాబు ని పరామర్శించే కార్యక్రమంలో భాగంగా బయటకొచ్చిన కొడాలి మీడియా ముందుకొచ్చారు.
వైసీపీ ఘోర పరాజయం తరువాత అనారోగ్య సమస్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని, తాజాగా జరిగిన అంబటి అరెస్టు తో తన అజ్ఞాతానికి స్వస్తి పలికారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కొడాలి, మంత్రి నారా లోకేష్ పై ఆయన రెడ్ బుక్ పై సినిమా తరహాలో పంచ్ డైలాగ్స్ పేల్చారు.
నీ రెడ్ బుక్ లో జగన్ పేరున్నా, జగన్ బుక్ లో నీ పేరునా రిస్క్ నీకే లోకేష్ అంటూ కొడాలి బాలకృష్ణ సినిమా డైలాగ్ కొట్టారు. మీ ప్రభుత్వ అరెస్టులకు వైసీపీ నాయకులు ఎవరు భయపడరని, మొన్న వల్లభనేని వంశీ అరెస్టు తో కానీ నిన్న అంబటి అరెస్టు తో కానీ రేపు నా అరెస్టుతో కానీ వైసీపీ ని భయపెట్టలేరంటూ కూటమి పై రెచ్చిపోయారు.
అయితే గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కొడాలి ఇప్పుడు సడెన్ గా మీడియా ముందుకొచ్చి ఇలా తన స్వరం పెంచి మరి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అంటే అది కొడాలికి రిస్కా.? లేదా వైసీపీ కా.? లేక టీడీపీ కా.? ఇప్పటికే టీడీపీ క్యాడర్ నుంచి పార్టీ సానుభూతిపరుల వరకు కొడాలి నాని సంగతేంటి అంటూ బహిరంగంగానే లోకేష్ పై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ క్రమంలో కొడాలి స్వయంగా బయటకొచ్చి తన పార్టీ నేతల అరెస్టుతో పాటుగా తన అరెస్టు గురించి కూడా ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేసే స్థాయికొచ్చారు. మరి ఇక ఇప్పుడైనా లోకేష్ కొడాలి పై ద్రుష్టి పెడతారా.? లేదా ఇంకా సమయం రాలేదు అంటూ వేచి చూసే ధోరణే అవలంభిస్తారా.?
అలాగే కొడాలి నాని సైతం కేవలం ఇలా రెండు డైలాగ్స్ కొట్టి జగన్ ని సంతృప్తి పరిచి తిరిగి సైలెంట్ అయిపోతారా.? లేదా తన మునుపటి ఫామ్ ని అందుకుని మళ్ళీ పార్టీలో యాక్టీవ్ అయ్యి టీడీపీ పై విరుచుకుపడతారా.? అయితే అంబటి అరెస్టు వ్యవహారంతో ఆయనకు మీడియా అటెన్షన్ లభించింది.
తత్పలితంగా అంబటికి వైసీపీ లో క్రెజ్ పెరిగింది, ఆ క్రెజ్ కి ఆయనకు జగన్ నుంచి కాపు టైగర్ అనే బిరుదు కూడా దక్కింది. ఇప్పుడు అదే క్రజ్ కోసం కూటమి ప్రభుత్వాన్ని రెచ్చకొట్టి తమను తాము హీరోలుగా చేసుకోవడానికి అరెస్టుల కోసం వైసీపీ అజ్ఞాత నాయకులందరూ ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారా.? అందులో భాగమే కొడాలి రీ ఎంట్రీ ఇచ్చారా.?
మరి ఆయన రీ ఎంట్రీ వైసీపీ కి రిస్కా.? టీడీపీ కి రిస్కా.? లేదా ఆ రిస్క్ కొడాలి నాని రాజకీయ జీవితానికా అనేది రానున్న రోజులలో తెలియనుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…