
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముంబైలో ఏషియన్ హర్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌స్టిట్యూట్ (హాస్పిటల్) లో ఏప్రిల్ 2వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. మరి కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచి తర్వాత ప్రైవేట్ రూమ్‌లోకి మారుస్తారు. అక్కడే హాస్పిటలో సుమారు నెలరోజులు ఉంటారని వైసీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని తామందరం భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని అన్నారు.
కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయించుకుంటున్న వార్తలు వచ్చినప్పుడు, పోలీసులు ఆయన పేరుని కేసులలో నుంచి తొలగించవచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన త్వరగా కోలుకొని విచారణకు హాజరవ్వాలని పోలీసులు కోరుకుంటున్నారు.
కనుక బైపాస్ సర్జరీతో కేసులు మాఫీ అయిపోవని స్పష్టమవుతోంది. ఒకవేళ అటువంటి అవకాశమే ఉంటే కేసులు ఎదుర్కొంటున్న వారందరూ ఏదో ఓ సర్జరీ చేయించుకొని బయటపడగలరు కదా?
కనుక కొడాలి నాని గుడివాడ తిరిగి రావడం ఆలస్యమైన ఆయన కోసం పోలీసులు, కేసులు ఎదురుచూస్తూనే ఉంటాయి. ఈ విషయం కొడాలి నాని కంటే ఎవరికి బాగా తెలుసు?
కనుక ముంబయిలో నెల రోజులు విశ్రాంతి తర్వాత ‘మరింత మెరుగైన విశ్రాంతి’ కోసం ఆయన అటు నుంచి అటే అమెరికాకు బయలుదేరితే పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కనుక కొడాలి నాని త్వరగా కొలుకోవాలి.. హనుమంతరావు చెపుతున్నట్లుగా నెలరోజుల తర్వాత అంటే మే రెండో వారంలో గుడివాడ తిరిగి వచ్చి విచారణకు హాజరవ్వాలని పోలీసులు కూడా ప్రార్ధించక తప్పదు!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…