
పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారం డాకించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కుతుంది. పార్టీ నుంచి రేవంత్ కి వ్యతిరేకంగా ఒక్కో స్వరం బయటకొస్తుంది. జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చిన్న రెడ్డి ఇలా ఒక్కొక్కరుగా ప్రత్యక్షంగా పార్టీ పై పరోక్షంగా రేవంత్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇప్పుడు ఇదే కోవలోకి చేరుకున్నారు కొండా కుమార్తె కొండా సుస్మిత. రేవంత్ మంత్రి వర్గంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈ కుటుంబం ఎందుకో ప్రభుత్వంలో ఇమడలేకపోతుందా.? లేదా నాయకులల్తో కలవలేకపోతుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మంత్రిగా కొండా సురేఖ సైతం నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే వస్తున్నారు. అయినా కూడా సీఎం రేవంత్ కొండా సురేఖ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం తరుచుగా ప్రభుతవరంలోని సహా మంత్రులతో పార్టీలోని ఇతర నేతలతో ఎప్పుడు పంచాయితీలు పెట్టుకుంటూనే వస్తున్నారు.
ఒకానొక సమయంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా గళం విప్పారు. అయితే ఆ అంశం మరింత ముదరకముందే సద్దుమణిగిపోవడంతో కొండా సుస్మిత పై పెద్దగా ఫోకస్ రాలేదు. కానీ నేడు సుస్మిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసారు.
దీనితో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలలో కొండా సుస్మిత పేరు మారుమోగుతోంది. అసలు విషయానికొస్తే కొండా సుస్మిత సీఎం రేవంత్ ని ఉద్దేశించి రేవంత్ కి సీఎం అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా.? పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీని రేవంత్ ఎలా ప్రకటిస్తారు.? అంటూ రెచ్చిపోయారు.
కొండా సురేఖ రాజకీయ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి పై సంచలమైన కామెంట్స్ చేసారు. సీఎం రేవంత్ రెడ్డి ని ఉదేశిస్తూ రేవంత్ కి సీఎం అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా.? అంటూ రెచ్చిపోయారు.
డైపర్లు వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తారు.? అంటూ రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అలాగే రేవంత్ సోదరులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని, గత ఎన్నికలలో కొండా మురళిని కారులో కూర్చుపెట్టుకుని పరకాలలో ప్రచారం చేస్తేనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని,
దమ్ముంటే రేవూరిని ఇప్పుడు రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల ప్రచారానికి రేవూరికి మద్దతుగా రేవంత్ రావాలని, వారికి ప్రత్యర్థిగా కొండా కుటుంబం బరిలోకి దిగుతుందంటూ కొండా సుస్మిత రేవంత్ కి సవాల్ చేసే స్థాయికి వెళ్లిపోయారు.
ఇక అక్కడితో కూడా ఆగకుండా సుస్మిత తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే మాత్రం ప్రెస్ క్లబ్ లో కూర్చొని మొత్తం భాగోతాలన్నీ బయటపెడతా అంటూ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కొండా సురేఖ మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో కొండా కుమార్తె ఇలా సీఎం కి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు అంటే సుస్మిత వెనుకున్న ఆ కొండ ఎవరు.? అనే చర్చ నడుస్తుంది.
Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan are set to launch…
Director Rahul Sankrityan has become a target of social media trolling after sharing his thoughts…