ఇమిటేషన్ ని ట్రోలింగ్ అనుకుంటే ఎలా?

Korean Kanakaraju Row: Varun Tej Clarifies NTR Dialogue

ఇవాళ విడుదలైన “కొరియన్ కనకరాజు” సినిమాని ఓ విషయంలో అనవసరంగా కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ టార్గెట్ చేయడం జరిగింది. ప్రీమియర్స్ నుండే ఆ గోల మొదలైంది. అలా ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ నడుస్తోంది.

విషయం ఏంటంటే.. “కొరియన్ కనకరాజు” సినిమాలో ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఒక ఫైట్ సీన్ లో విలన్ గ్యాంగ్ మెంబర్ తో తన్నులు తిన్న సత్య “మీ స్ట్రోక్స్ చాలా ఎమెచ్యురిష్ గా ఉన్నాయి” అంటూ సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలోని ఒక డైలాగ్ ను ఇమిటేట్ చేస్తాడు.

సాధారణంగా ఈ తరహా మీమ్స్ & ఇమిటేషన్స్ కామన్ అయినప్పటికీ.. ఈ అమెచ్యురిష్ అనే డైలాగ్ గత వారం రోజులుగానే ట్విట్టర్లో & మీమ్స్ లో ట్రెండ్ అవుతుంది. దాంతో ఇది కావాలనే ఎన్టీఆర్ ని కించపరిచేలా సినిమాలో అప్పటికప్పుడు ఇరికించారని, దాన్ని వెంటనే సినిమాలో నుండి తొలగించాలని గోల మొదలైంది.

అయితే.. ఈ విషయమై స్పందించిన వరుణ్ తేజ్ “మేం ఆ సీన్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో షూట్ చేసాం. నా పాత సినిమాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలని కూడా ఇమిటేట్ చేసాం. వాటిని ఫన్నీగా తీసుకోవాలి కానీ.. ట్రోలింగ్ అంటూ తప్పుదోవ పట్టించకూడదు. మేం అస్సలు ట్రోల్ చేయలేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

మరి వరుణ్ ఇచ్చిన క్లారిటీతో ఈ సోషల్ మీడియా గోల తగ్గుతుందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఈ ఇమిటేషన్ డైలాగ్ వైరల్ అవ్వడం వల్ల సినిమా పబ్లిసిటీకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories