
నిజానికి ‘ఎ’ రేటింగ్ దక్కించుకున్న కృష్ణాజిల్లా సాధారణ సూచీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ విభాగంలో ‘సి’ రేటింగ్‌తో సరిపెట్టుకున్నా, సామాజిక, ఆర్థిక సూచీల్లో ముందంజలో ఉండడంతో ‘ఎ’ రేటింగ్‌తో అగ్రస్థానం దక్కించుకోగలిగింది. సామాజిక, ఆర్థిక, సాధారణ సూచీల్లో పశ్చిమగోదావరి జిల్లా ‘ఏ’ రేటింగ్‌లో నిలిచినప్పటికీ మొత్తంగా కృష్ణాజిల్లా కంటే వెనకబడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక సామాజిక సూచీలో వెనకబడిన ప్రకాశం జిల్లా ‘బి’ రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఆర్థిక సూచీలో నెల్లూరు జిల్లా ‘ఎ’ రేటింగ్ సాధించినప్పటికీ మిగిలిన సూచీల్లో ద్వితీయ స్థానానికి పరిమితం కావడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రేటింగ్స్ తో ఆయా జిల్లాలు ఏయే విభాగాలలో రాణిస్తున్నాయో అధికారులకు తేలికగా అవగతమవుతోంది.
Gujarat Titans delivered a dominating performance against Sunrisers Hyderabad in the 56th match of IPL…
Success and failures can come thick and fast in the film industry as the tide…