
పాలన కొనసాగించేందుకే ప్రభుత్వాలు ఉంటాయి. వాటిని నడిపించేందుకు ప్రజలే పాలకులను ఎన్నుకుని వారికి అధికారం కట్టబెడతారు. కనుక ఓ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసినా, సంక్షేమ పధకాలు అమలుచేసినా అది దాని బాధ్యతే తప్ప గొప్పవిషయం కానే కాదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ప్రజాధనంతోనే వాటిని అమలుచేస్తుంది తప్ప తన సొంత డబ్బు ఖర్చుపెట్టి చేయదు కనుక.
అయితే ప్రభుత్వాలను నడిపించే పాలకులు రాజకీయ అవసరాలు, ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు కూడా గాడి తప్పుతుంటాయి జగన్ ప్రభుత్వంలాగ! ఇందుకు ఉదాహరణగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే అన్నట్లు కదలకుండా మన కళ్లెదుటే ఉన్నాయి.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి, పోలవరం, అభివృద్ధి పనుల గురించి ఆలోచించలేదు. మాట్లాడలేదు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విజయవాడలో డా.అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడుతుంటారు. కృష్ణానది కరకట్ట క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు ‘దానిని మేమే నిర్మించి నగరంలో ప్రజలను కాపాడామని’ గొప్పలు చెప్పుకుంటారు. అయితే దానిని ఎప్పుడు ఎవరు కట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఇంకా బాగా తెలుసు.
టిడిపి హయాంలో కరకట్టని 2016లో మొదలుపెట్టి 2019 నాటికి నిర్మిస్తే దానిని ‘మేమే కట్టామని’ వైసీపి చెప్పుకోవడం ఎవరికో పుట్టిన బిడ్డకి నేనే తండ్రినని చెప్పుకున్నట్లుగానే భావించవచ్చు. అమరావతిని వద్దనుకున్న జగన్, అక్కడ ఉద్యోగుల కోసం టిడిపి ప్రభుత్వం కట్టించిన భవనాలకు వైసీపి రంగులు వేసుకున్నట్లుగా, టిడిపి హయాంలో కట్టిన కరకట్టని ‘మేమే కట్టించాము. విజయవాడ ప్రజలను జగన్ కాపాడారు,” అని డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టాకనే పట్టాభివంటి టిడిపి నేతలు సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు వచ్చి కరకట్ట నిర్మాణం గురించి వాస్తవాలు చెప్పాల్సి వస్తోంది లేకుంటే ఎవరూ దాని గురించి మాట్లాడేవారే కారు.
అయితే టిడిపి హయాంలో కరకట్ట నిర్మించినప్పటికీ దానిని టిడిపి ప్రభుత్వం ఓ బాధ్యతగానే భావించింది తప్ప అదేదో ఘనకార్యమన్నట్లు, దాంతో ప్రజలని ఉద్దరిస్తున్నామన్నట్లు గొప్పలు చెప్పుకోలేదు. కానీ జగన్ ప్రభుత్వం కొసరు పనులు చేసి నిసిగ్గుగా అది మేమే నిర్మించామని వైసీపి గొప్పలు చెప్పుకుంటోంది.
అయితే అది కృష్ణ కరకట్ట అయినా పోలవరం ప్రాజెక్టు అయినా అది ప్రభుత్వ బాధ్యతే కదా? అందుకే ప్రజలు ఎన్నుకున్నారు కదా? కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ప్రభుత్వం సక్రమంగా బాధ్యత నిర్వర్తించకపోగా రాష్ట్రానికి అంతులేని నష్టం కలిగించిన మాట వాస్తవం కాదా?పైగా ఇప్పుడు నిసిగ్గుగా ఈ ప్రచారం కూడా!
ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ యుద్ధ పరిణామాలు, హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…
మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో…