
గత ఏడేళ్ళుగా రెండు రాష్ట్రాలు కీచులాడుకొంటూనే ఉన్నాయి కానీ మా మద్య ఎటువంటి విభేధాలు లేవని కేంద్రప్రభుత్వం కారణంగా దూరం పెరిగిందని కేటీఆర్ చెప్పడం విశేషం. అంటే మళ్ళీ వైసీపీతో దోస్తీకి టిఆర్ఎస్ సిద్దంగా ఉందని సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు. టిఆర్ఎస్‌లో ఈ అకస్మాత్తు మార్పుకి బలమైన కారణమే ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ బిజెపి బలపడుతుండటంతో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంపై కత్తులు దూస్తూ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. పనిలో పనిగా సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా బిజెపిని వ్యతిరేకిస్తున్న అక్కడి పార్టీల అధినేతలతో సమావేశమయ్యి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు చర్చించారు. కానీ పొరుగునే ఉన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలవలేదు! కలుపుకుపోవాలని ప్రయత్నించలేదు! జగన్మోహన్ రెడ్డి నిధులు, కేసులలో ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వానికి విధేయంగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆయన పరిస్థితి చూసి అడిగి ప్రయోజనం లేదని కలవలేదేమో?
అయితే వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ప్రశాంత్ కిషోర్‌తో సుదీర్గ చర్చల తరువాత కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా మోడీ, అమిత్ షాలను ఎదుర్కొని నిలవలేమని కేసీఆర్ కూడా గ్రహించినట్లే ఉన్నారు. అయినప్పటికీ కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేదు కనుక తన యుద్ధంలో వైసీపీని కూడా కలుపుకోగలిగితే మరింత బలం చేకూరుతుందని భావిస్తునందునే ఈ సంకేతం ఇచ్చి ఉండవచ్చు.
వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్, వైసీపీలకు ఎదురీత తప్పదు. కనుక ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. గత ఎన్నికలలో చంద్రబాబునాయుడుని గద్దె దించేందుకు సిఎం కేసీఆర్ తెర వెనుక వైసీపీకి సాయం అందించిన సంగతి అందరికీ తెలుసు. కనుక ఇప్పటి నుంచే కలిసి పనిచేస్తే మంచిదనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఈవిదంగా సంకేతం పంపించి ఉండవచ్చు. అయితే కేసీఆర్ స్నేహ హస్తాన్ని జగన్ అందుకొంటారా? కేసీఆర్‌ను నమ్మోకొని మోడీతో కయ్యానికి సిద్దపడతారా?రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…
Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…