Telugu

అల్లు అర్జున్ అరెస్ట్ మీద మొదలైన రాజకీయం..!

ఎవరు ఔనన్నా కాదన్నా రాజకీయ రంగానికి సినీ రంగానికి మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఇందుకు బిగ్ బీ అమితాబ్ నుంచి మెగా స్టార్ చిరు వరకు, ప్రధాని మోడీ నుంచి రేవంత్ వరకు ఎవ్వరు అతీతులు కాదు కాలేరు.

తాజాగా తెలంగాణలో మొదలైన అల్లు అరెస్టు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అరెస్టు కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ కు మద్దతుగా హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.

ADVERTISEMENT

అయితే ఈ సినీ సెలబ్రెటీ వివాదానికి ఇక రాజకీయ రంగు పులమడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ఉచ్చుకత చూపిస్తూ ముందుకొస్తున్నాయి. ఇటువంటి వివాదాలను తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే వైసీపీ ఇప్పుడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవబడనికి తహతహలాడుతోంది.

ఇందులో మరి ముఖ్యంగా సినిమా రివ్యూయర్ గా పేరుపొందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనదైన స్టైల్ లో అల్లు కు మద్దతు తెలియ చేసారు.

ఒక జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను రేవంత్ సర్కార్ అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట, తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు జరిగిన ఘటనలో వైఫల్యం ఎక్కడుంది.? నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనేది నిరూపించాలిగా.? ఒక పాన్ ఇండియా స్టార్ సెలబ్రెటీని ఒక సాధారణ నేరస్తుడిగా భావించి ఈ విధంగా ఇంటికి వెళ్లి మరి అరెస్టు చేయడం సరికాదు అంటూ అల్లు అర్జున్ అరెస్టు ఖండించారు.

ఇక అల్లు అర్జున్ అరెస్టు మీద మీడియా వస్తున్నా కథనాలు చూస్తుంటే బన్నీకి పదేళ్లు జైలు శిక్షా.? లేక ఐదేళ్లా.? అంటూ హెడా లైన్స్, బన్నీ కోసం రంగంలోకి దిగిన మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారాలు ఇలా ఎవరికీ తోచిన ధోరణిలో వారు వాస్తవాలను కాకుండా ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో మొదలైన ఈ అరెస్టు రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేది కాదు. ఇక ఈ అరెస్టు మీద సోషల్ మీడియాలో వస్తున్నా విశ్లేషణలు, కామెంట్స్ చూస్తే, మంత్రి కొండా సురేఖ మీద సినీ ఇండస్ట్రీ నోరు జారినందుకు ఇండస్ట్రీకి ఇది ఒక హెచ్చరిక అంటూ ఒకరు, కనీసం తెలంగాణ సీఎం పేరు కూడా గుర్తులేదా అంటూ మరొకరు ఇలా ఎవరికీ నచ్చిన రీతిలో వారు దీన్ని రాజకీయం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అలాగే అల్లు కి మద్దతుగా నిర్మాత దిల్ రాజు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ ఘటన మీద అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తారు అన్న ఆలోచన అటు అల్లు కుటుంబానికే కాదు కనీసం ఒక సామాన్య వ్యక్తికీ కూడా రాలేదు అనేది వాస్తవం.

ఇటువంటి ఘటనలు జరిగినప్పటికీ చిత్ర యూనిట్ బాధితులకు తగిన సాయమందించి విషయాన్ని అక్కడితో ముగించేవారు. కానీ ఇప్పుడు అన్యుహాయంగా ఏ విషయం ఏకంగా హీరో అరెస్టు వరకు వచ్చింది. అయితే దీన్ని సినీ పరిశ్రమతో పాటు బన్నీ అభిమానులు, సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు ఇలా ఏఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు.

రేవంత్ దూకుడుగా ముందుకెళ్లుతున్నారా.? లేక మరేదైనా విషయాన్ని డైవర్ట్ చేయడనికి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారా.? అనేది కాలమే సమాధానం చెపుతుంది. అయితే ఏది ఏమైనప్పటికి ఇటువంటి సెలబ్రెటీ అరెస్టులు అటు సినీ ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆలోచనలో పడేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం అక్కర లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Balayya’s Jubilee Hills Property to Make Way for Road Widening

Nandamuri Balakrishna has agreed to surrender a portion of his residential property for road-widening works…

25 minutes ago

Rajamouli’s Unfinished Epic Dream: Can Varanasi Deliver?

SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…

55 minutes ago